ETV Bharat / business

How to Get 20k Monthly Pension after Retirement : మీరు ఉద్యోగ విరమణ దశలో ఉన్నారా..?, నెలవారీగా 20వేలు పొందొచ్చు - Start Saving Early

20k Monthly Pension Ways : మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా..?, ఇప్పటి నుంచే పదవీ విరమణ కోసం డబ్బును పొదుపు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా..?, 2023లో ఉన్న పెన్షన్ స్కీమ్‌ల కోసం వెతుకుతున్నారా..? అయితే, నెలవారీగా 20K పెన్షన్ పొందే మార్గాలను ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.

Investment Plans Details
20k Monthly Pension
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 7:18 PM IST

20k Monthly Pension Investment Plans Details : ఉద్యోగంలో చేరినా ప్రతి వ్యక్తి.. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే నాటికి అప్ప‌టి ఖ‌ర్చుల‌కు అనుగుణంగా ఎంతో కొంత డబ్బును పొదుపు చేసుకోవాలి. ఎందుకంటే.. పదవీ విరమణ చేసిన తర్వాత నెలవారీ ప్రాతిపదికన రెగ్యులర్ జీతం ఆశించలేరు కాబట్టి. అందుకే పదవీ విరమణ కోసం ఉద్యోగంలో చేరినా నాటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా కీలకం. తద్వారా రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, ఆనందమైన జీవితాన్ని గడపవచ్చు. దీంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉండవచ్చు. అయితే, చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణకు ప్లాన్ చేసుకోకుండా వృధా ఖర్చులు చేస్తుంటారు. అటువంటివారు ఇప్పటికైనా మేల్కొని ప్రణాళికబద్దంగా పదవీ విరమణకు ప్లాన్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరి, ఆ మార్గాలు ఏమిటి..?, 2023లో ఏయే పెన్షన్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి..? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పదవీ విరమణ తర్వాత నెలవారీగా 20K పెన్షన్ పొందడానికి, పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక నిపుణులు కొన్ని ఉత్తమ మార్గాలను వెల్లడించారు.

  • మొదటి నుంచే సేవ్ చేసే మార్గం
  • మీ సహకారాన్ని పెంచుకునే మార్గం
  • మీ పెట్టుబడులను విస్తరించుకునే మార్గం
  • ప్రాయోజిత ప్రణాళికల కోసం పరుగెత్తడం
  • పెన్షన్ యాన్యుటీ ప్లాన్‌లను ఎంచుకోవటం
  • పన్ను ప్రయోజనాలను ఉపయోగించటం

1. మొదటి నుంచే డబ్బు ఆదా చేయడం..
Start Saving Early : మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడే మీ పదవీ విరమణ కోసం ఎంత త్వరగా డబ్బును పొదుపు చేస్తే అంత మంచిది. దీని ద్వారా కొంత కాలం పాటు మీ పెట్టుబడులు పెరగడానికి మీకు స్కోప్ లభిస్తుంది. అంతేకాకుండా, ముందుగానే పొదుపు చేయడం వల్ల పదవీ విరమణ తర్వాత మీ జీవితానికి పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరుతుంది.

NPS Scheme Benefits : రోజుకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.57 వేలు పెన్షన్​!

2. మీ సహకారాన్ని పెంచుకోండి
Increase Your Contributions : 20K నెలవారీ పెన్షన్‌ను పొందడానికి మరొక ఉత్తమ మార్గం.. రిటైర్‌మెంట్ ఖాతాకు మీ సహకారాన్ని అనుసంధానం చేయటం. దీని ద్వారా మీ యజమాని లేదా కంపెనీ అందించే సహకారాలు మీ పదవీ విరమణ పొదుపుకు బాగా ఉపయోగపడతాయి.

3. మీ పెట్టుబడులను విస్తరించుకోవటం..
Spread Your Investments : పదవీ విరమణ కోసం గరిష్ట పొదుపులను పొందాలంటే మీ పెట్టుబడులను విస్తరించుకోవాలి. అలా చేస్తే బాండ్‌లు, రియల్ ఎస్టేట్, స్టాక్‌ మార్కెట్‌ల వంటి విభిన్న పెట్టుబడులలో మీ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అదే సమయంలో మీ ఆర్థిక పరిధిని పెంచుకోవచ్చు.

4. ప్రాయోజిత ప్రణాళికల కోసం ప్లాన్ చేయటం:
Go For Employer-Sponsored Plans : గరిష్టంగా అనుమతించదగిన సహకారాన్ని ఆస్వాదించడానికి యజమాని-ప్రాయోజిత ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టండి. మీ సర్వీస్ కోసం పదవీ విరమణ ప్రాతిపదికన నిర్దిష్ట సంవత్సరాల్లో నిర్దిష్ట ఆదాయాన్ని అందించే పెన్షన్ ప్లాన్‌ల కోసం చూడండి.

Retirement Planning : నెలకు రూ.50 వేలు పెన్షన్ ఇచ్చే.. బెస్ట్​ రిటైర్​మెంట్ ప్లాన్స్​​ మీకు తెలుసా?
5. పెన్షన్ యాన్యుటీ ప్లాన్‌లను ఎంచుకోవటం
Choose Pension Annuity Plans : భారతదేశంలో అత్యుత్తమ పెన్షన్ ప్లాన్ 'పెన్షన్ యాన్యుటీ ప్లాన్' రూపంలో వస్తుంది. ఇది పదవీ విరమణ తర్వాత స్థిరమైన నెలవారీ పెన్షన్‌ను అందిస్తుంది. గ్యారెంటీ రిటర్న్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం చూస్తున్న వారు పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.

6. పన్ను ప్రయోజనాలను ఉపయోగించటం
Use Tax Benefits : పదవీ విరమణ కోసం చేసిన పెట్టుబడులపై భారత ప్రభుత్వం పన్ను ప్రయోజనాలను అందిస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి, మీ పొదుపులను పెంచుకోవడానికి, మీ పన్నును తగ్గించుకోవడానికి ఇటువంటి పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

NPSలో చేరితే దిల్​ఖుష్​ రిటైర్మెంట్.. ట్యాక్స్ బెనిఫిట్స్.. సూపర్ రిటర్న్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.