How to Solve Google Pay not Working Issue : ప్రస్తుత కాలంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం.. ఆన్ లైన్ చెల్లింపులకోసం విరివిగా ఉపయోగిస్తున్న యూపీఐ పేమెంట్ యాప్స్. వీటిలో గూగుల్ పే ప్రముఖమైనది. చాలామంది గూగుల్ పే వాడుతూ ఉంటారు. ఎప్పుడైతే యూపీఐ పేమెంట్ యాప్స్(UPI Payment Apps) వచ్చాయో చాలా వరకు వాటి ద్వారానే భారీ మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి సర్వర్ సమస్య తలెత్తి మధ్యలోనే పేమెంట్స్ ఆగిపోవడం మనం చూస్తుంటాం. అన్ని యాప్స్ మాదిరిగానే గూగుల్ పేలో కూడా మనీ చెల్లింపులు జరుపుతున్నప్పుడు కొన్ని సార్లు పనిచేయకపోవడంతో యూజర్లు ఆందోళనకు గురవుతుంటారు. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సులువుగా ఏలా పరిష్కరించుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
Google Pay పని చేయనప్పుడు మీరు ఎదుర్కొనే సమస్యలు :
Google Pay పని చేయనప్పుడు దానిని పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేదా లింక్ చేయబడిన అకౌంట్లలో సమస్యలు తలెత్తినప్పుడు సర్వర్ ఈ గూగుల్ పేని పనిచేయకుండా ఆపుతుంది. Google Pay వినియోగదారులు ప్రతిసారీ ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు ఇప్పుడు తెలుసుకుందాం..
- UPI పిన్‌ని ధృవీకరించడంలో సమస్య
- Google Pay రిజిస్ట్రర్ కాకపోవడం
- Google Pay OTPని ధృవీకరించకపోవడం
- బ్యాంక్ ఖాతాను యాడ్ చేయడం సాధ్యపడకపోవడం
- బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్‌లో సమస్య
- Google pay నుంచి డబ్బు పంపడం సాధ్యం కాకపోవడం
- Google Pay నుంచి డబ్బును స్వీకరించడం సాధ్యం కాకపోవడం
- UPI id యాక్టివేట్ కాకపోవడం
Google పే చెల్లింపు ఫెయిల్ అవ్వడం.. ఇలా చాలా సమస్యలు మనం గూగుల్ పే పనిచేయనప్పుడు ఎదుర్కొంటాము. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం.
Causes of Google Pay not Working Issue :
ముందు మీరు ప్రాథమికంగా కొన్ని అంశాలను మీ ఫోన్‌లో చెక్ చేసుకోండి..
- డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్‌లా కాకుండా, Google పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంటర్నెట్ అవసరం.. కాబట్టి అది ఓసారి చెక్ చేసుకోవాలి.
- మీరు బదిలీ చేస్తున్న డబ్బు మొత్తాన్ని మార్చడానికి ప్రయత్నించండి. అలాగే, లావాదేవీ చేయడానికి మీ వద్ద తగినంత బ్యాలెన్స్ ఉందా లేదా? అనేది నిర్ధారించుకోండి.
- ఒకవేళ సమస్య రిసీవర్‌తో ఉండవచ్చు. కచ్చితంగా నిర్ధారించుకోవడానికి మరొక ఖాతాకు చిన్న మొత్తాన్ని పంపడానికి ప్రయత్నించండి.
- మీరు చేసే మనీ ట్రాన్స్ఫర్ విజయవంతం కావాలంటే డబ్బు పంపేవారు, స్వీకరించేవారు ఇద్దరూ తమ బ్యాంక్ ఖాతాను Google Payకి లింక్ చేసి ఉండాలి.
- మీరు సరైన UPI పిన్‌ని ఉపయోగిస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే మీ అప్లికేషన్ తాజాగా ఉందో లేదో చూసుకోవాలి.
How to fix Google Pay not Working on Android Phones :
Google Pay పని చేయడం ఆగిపోయినప్పుడు ఇలా పరిష్కరించుకోండి..
Google Pay యాప్‌ని అప్‌డేట్ చేయండి : ఒకవేళ మీ గూగుల్ పే యాప్ గడువు ముగిసిందేమో చెక్ చేసుకోవాలి. గడువు ముగిసినట్లయేతే చాలా సమస్యలు ఎదురవుతాయి. గూగుల్ పనిచేయకపోవడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వెంటనే మీ ప్లేస్టోర్‌లో అప్‌డేట్ అయిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం గూగుల్ పే యాప్ తెరిచి సమస్య పరిష్కారం అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి.
బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేయండి : గూగుల్ పే పనిచేయకపోవడానికి మరో సమస్య బ్యాంక్ అకౌంట్ సమాచారం పాతది ఉండడం. అప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ముందు మీ బ్యాంక్ అకౌంట్‌ను తొలగించాలి. అనంతరం మళ్లీ అకౌంట్‌ను యాడ్ చేయాలి.
GPayలో Cache Build-upని క్లియర్ చేయండి : సాధారణంగా గూగుల్ పే వాడినప్పుడు అందులో Caches ఏర్పడతాయి. అటువంటి సమయంలో మనం ఎప్పటికప్పుడు Caches క్లియర్ చేస్తుండాలి. ఇలా చేయడం ద్వారా గూగుల్ పేలో లావాదేవీలు జరిపేటప్పుడు సమస్యలు ఏర్పడవు.
GPay యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి : గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పుడు సమస్యలు తలెత్తినప్పుడు పైన పేర్కొన్న విధంగా చేసిన కూడా మరోసారి సమస్య వస్తే ఇలా చేయండి. ముందుగా గూగుల్ పే యాప్(Google Pay)ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఆ తర్వాత మళ్లీ ప్రెష్‌గా ప్లే స్టోర్ ద్వారా Google Pay యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. అనంతరం మళ్లీ మీరు ఉపయోగించే అకౌంట్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ లావాదేవీలు కొనసాగించండి. ఇలా పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా గూగుల్ పే పనిచేయనప్పుడు సింపుల్‌గా ఇలా చెక్‌చేసుకొని మీ చెల్లింపులు చేసుకోండి.
Personal loan on Google Pay: మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా.. అయితే, మీకు లక్ష దాకా రుణం వచ్చేసినట్టే..!
గూగుల్ పే యూజర్లకు ఫ్రీగా రూ.88వేలు.. వెంటనే వాడుకుంటే ఓకే.. లేదంటే..!