ETV Bharat / business

How to Check PF Balance in Easy Way : క్షణాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. UAN, ఇంటర్నెట్ కూడా అవసరం లేదు..! - ఉమాంగ్ యాప్

How to Check PF Balance in Easy Way: పీఎఫ్ అకౌంట్​లో ఎంత సొమ్ము ఉందో తెలుసుకోవాలంటే.. ఆన్​లైన్​లోకి వెళ్లి, UAN ఎంటర్ చేసి, బఫరింగ్ అవుతుంటే వెయిట్ చేసి.. చిరాకు పడుతున్నారా? ఆ ఇబ్బందేమీ లేకుండా.. అసలు UAN, ఇంటర్నెట్ కూడా లేకుండా మీ పీఎఫ్ బ్యాలెన్స్​ వివరాలను తెలుసుకోండి..!

How to Check PF Balance in Easy Way
EPFO Balance Check
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 10:33 AM IST

Updated : Oct 13, 2023, 10:43 AM IST

Best Four Ways to Check EPF Balance in Telugu : ప్రస్తుతం ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ దాదాపు ఈపీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఈపీఎఫ్ఓ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) ఈ ఖాతాలను నిర్వహిస్తుంటుంది. జాబ్​ చేసే ప్రతీ ఉద్యోగి నెలనెలా తన ప్రాథమిక జీతంలో 12 శాతం పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్​గా చెల్లిస్తారు. సరిగ్గా అంతే మొత్తంలో వారి యజమాని లేదా కంపెనీ ఆ అకౌంట్​కి జమ చేస్తారు. అయితే చాలా మంది తమ ఖాతాలో ప్రతి నెల ఎంత మనీ జమ అవుతుందో తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ, అది ఎలానో తెలియక సతమతమవుతుంటారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మీరు పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన పని లేదు. పనిచేస్తున్న సంస్థను అడగాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్​గా మీరు ఉన్న చోటు నుంచే మీ పీఎఫ్ అకౌంట్(PF Balance Check)​లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవచ్చు.

How to Check EPFO Balance in Telugu : అందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మీ పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు నాలుగు ఉత్తమ మార్గాలు ఉన్నాయి. అవే ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్, మొబైల్ ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్. వీటిలో దేనిని ఉపయోగించైనా మీ అకౌంట్​లోని డబ్బులు ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే.. అందుకు ప్రధానంగా పీఎఫ్ ఖాతాకి మీ మొబైల్ నంబర్ అనుసంధానం అయి ఉండాలి. ఎందుకంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారానే ఈ సేవలను పొందేందుకు వీలుంటుంది. కాబట్టి ఎవరైనా మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోకపోతే ముందుగా దానిని అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత సింపుల్​గా ఈ మార్గాల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.

ఈ నాలుగు ఉత్తమ మార్గాల్లో మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ సింపుల్​గా చెక్ చేసుకోండిలా..

Best Four Ways to Check EPF Balance in Telugu :

EPFO ​​వెబ్‌సైట్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..

  • మొదట మీరు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ (www.epfindia.gov.in)ను సందర్శించి.. అందులో "Our Services" విభాగంలోని "For Employees" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత "Member Passbook" ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ అడిగిన మీ యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబర్), పాస్ వర్డ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత అప్పటి వరకు మీరు, మీ యజమాని చేసిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్‌ను స్క్రీన్ మీద చూడొచ్చు.
  • అదేవిధంగా మీరు అప్పటి వరకు పొందిన పీఎఫ్ వడ్డీ మొత్తాన్ని కూడా డిస్​ప్లే మీద చూడొచ్చు.
  • ఒకవేళ మీ యూఏఎన్‌కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పీఎఫ్ నంబర్లు జోడించి ఉన్నట్లయితే, అవి కూడా అక్కడ చూడొచ్చు.

How Much Money You Can Withdraw from PF : ఉద్యోగంలో ఉండగానే పీఎఫ్ విత్​డ్రా చేసుకోవచ్చు... ఎంత శాతమో తెలుసా?

UMANG యాప్ ద్వారా : కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్(UMANG App) ద్వారా కూడా సింపుల్​గా పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్​లో ఉమాంగ్ యాప్​ని డౌన్​లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థించిన సమాచారాన్ని అందించడం ద్వారా లాగిన్ అవ్వాలి. ఆపై అందులో ఈపీఎఫ్‌ఓ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యూఏఎన్ నంబర్ ఎంటర్ చేస్తే మొబైల్​కు వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. అంతే మీ పీఎఫ్ ఖాతా వివరాలు కనిపిస్తాయి.

ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ వివరాలు : UAN లేకుండా మొబైల్‌ ద్వారా మీరు పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి SMS సేవను ఉపయోగించుకోవచ్చు. అందుకోసం మీరు మొబైల్​లో EPFOHO UAN ENG అని టైపే చేసి 77382 99899 నంబర్‌కి SMS పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మాత్రమే సందేశం పంపించాలి. ఇలా పంపిన తర్వాత రిటర్న్ మెసేజ్​లో మీ చివరి పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌తో పాటు మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను అందుకుంటారు.

మిస్డ్​కాల్ ద్వారా పీఎఫ్ వివరాలు : యూనిఫైడ్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ నమోదు చేసుకున్న వినియోగదారులు 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలతో కూడిన SMS పొందుతారు. దీని కోసం మీకు UAN కూడా అవసరం లేదు. ఈ సర్వీసును పూర్తి ఉచితంగా తమ వినియోగదారులకు EPFO అందిస్తోంది.

How to Activate UAN Number : మీ 'EPFO UAN నంబర్' సింపుల్​గా ఆన్​లైన్​లో ఇలా యాక్టివేట్ చేసుకోండి.!

PF Interest 2023 : పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియ మొదలైంది.. ఇలా సింపుల్​గా చెక్ చేసుకోండి!

Last Updated : Oct 13, 2023, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.