ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ సేవలకు అంతరాయం కలిగింది. భారత్‌లోని పలు పట్టణాల్లో డిస్నీ+ హాట్‌స్టార్ సర్వర్ డౌన్ అయింది. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఈ అంతరాయంపై.. సోషల్‌మీడియా వేదికగా వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. లాగిన్ చేసే సమయంలో వస్తున్న ఎర్రర్ మెసేజ్‌ను.. స్క్రీన్‌షాట్‌లు తీసి ట్విటర్లో షేర్ చేస్తున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ అంతరాయం కలిగినట్లు చెబుతున్నారు.
దీనిపై ఇప్పటివరకు 500 మంది భారత వినియోగదారులు ఫిర్యాదు చేశారని డౌన్‌డిటెక్టర్.కామ్ వెబ్‌సైట్ వెల్లడించింది. దిల్లీ, జైపుర్, లఖ్‌నవూ, కోల్‌కతా, నాగ్‌పుర్, హైదరాబాద్, ముంబయి సహా మరికొన్ని చోట్ల డిస్నీ+ హాట్‌స్టార్ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలిసింది. తమ సేవల్లో అంతరాయంపై డిస్నీ+ హాట్‌స్టార్ స్పందించింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. తమ యాప్, వెబ్సైట్లలో ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొంది. సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది.
-
This is what is happening on my screen when I'm clicking on the Hotstar app. pic.twitter.com/mpmy3cAP2W
— KSR (@KShriniwasRao) February 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is what is happening on my screen when I'm clicking on the Hotstar app. pic.twitter.com/mpmy3cAP2W
— KSR (@KShriniwasRao) February 17, 2023This is what is happening on my screen when I'm clicking on the Hotstar app. pic.twitter.com/mpmy3cAP2W
— KSR (@KShriniwasRao) February 17, 2023