ETV Bharat / business

హోటల్స్, రెస్టారెంట్స్​ సర్వీస్ ఛార్జ్ విధించడంపై బ్యాన్ - సర్వీస్ ఛార్జి

Service charge in restaurant: హోటల్, రెస్టారెంట్​ బిల్​లో సర్వీస్​ ఛార్జ్ చూసి షాకయ్యారా? ఎందుకు కట్టాలని అక్కడి సిబ్బందితో వాదించి విసుగెత్తిపోయారా? చివరకు చేసేదేమీ లేక వారు చెప్పినంత బిల్ చెల్లించి వచ్చేశారా? ఇకపై అలా కుదరదు. కొత్త రూల్స్ ప్రకారం.. సర్వీస్ ఛార్జ్​ విధించడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేయాలో తెలుసుకునేందుకు పూర్తి కథనం చదవండి.

hotels
hotels
author img

By

Published : Jul 4, 2022, 6:04 PM IST

Service charge in restaurant: హోటల్స్, రెస్టారెంట్స్​లో సర్వీస్ ఛార్జ్ బాదుడు నుంచి ఉపశమనం కలిగించేలా కీలక ఆదేశాలు వెలువడ్డాయి. బిల్​లో ఆటోమెటిక్​గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధించింది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ). నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్​ అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ ఛార్జ్ విషయంలో ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. హోటల్స్, రెస్టారెంట్లు బిల్స్ వేయడంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం...

  • హోటల్స్ లేదా రెస్టారెంట్స్.. బిల్​లో సర్వీస్ ఛార్జ్​ను ఆటోమెటిక్​గా యాడ్ చేయకూడదు.
  • ఇతర పేర్లతో సర్వీస్​ ఛార్జ్ వసూలు చేయకూడదు.
  • సర్వీస్ ఛార్జ్​ చెల్లించాలని వినియోగదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి చేయరాదు. సేవా రుసుము చెల్లింపు.. పూర్తిగా ఐచ్ఛికమని వారికి స్పష్టంగా చెప్పాలి.
  • సర్వీస్​ ఛార్జ్​ చెల్లిస్తారా లేదా అనే విషయం ఆధారంగా వినియోగదారులను హోటల్​ లేదా రెస్టారెంట్​ లోపలకు అనుమతించడం, లేదా వారికి అందించే సేవలపై ఆంక్షలు విధించడం చేయకూడదు.
  • ఫుడ్​ బిల్​తోపాటే సర్వీస్ ఛార్జ్ కూడా విధించి.. ఆ మొత్తంపై జీఎస్​టీ వసూలు చేయడం నిషిద్ధం.
  • నిబంధనలు విరుద్ధంగా ఏదైనా హోటల్​ లేదా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జ్ విధించిందని కస్టమర్ భావిస్తే.. బిల్ నుంచి ఆ అదనపు మొత్తాన్ని తొలగించాలని అక్కడి యాజమాన్యాన్ని అడగొచ్చు.
  • నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కస్టమర్లు 1915 నంబర్​కు కాల్ చేసి లేదా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్​లైన్​(ఎన్​సీహెచ్​) యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
  • సర్వీస్ ఛార్జ్ విషయమై కస్టమర్లు వినియోగదారుల కమిషన్​కూ ఫిర్యాదు చేయవచ్చు.

ఇదీ చూడండి : ఈ పోస్టాఫీస్​ పొదుపు పథకాలు తెలుసా? వడ్డీ రేటు 7% పైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.