ETV Bharat / business

వడ్డీ రేట్లు పెరుగుతున్న వేళ- ఆర్థిక ప్రణాళికలు వేసుకోండిలా.. - ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

hike interest rates: తక్కువ వడ్డీ రేట్లతో కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తూ.. ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ఆగస్టు 2018 తర్వాత తొలిసారి 40 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లు ఇక పెరగడం ప్రారంభం అయినట్లే. ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లు, చిన్న మొత్తాల పొదుపరులకు ఇది శుభవార్తే. రుణాలు తీసుకున్న వారు.. ఇతర పెట్టుబడులు ఉన్నవారు వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో ఏం చేయాలో చూద్దాం.

hike interest rates
వడ్డీ రేట్లు
author img

By

Published : May 6, 2022, 7:35 AM IST

hike interest rates: ద్రవ్యోల్బణం అంచనాలను మించి ఉండటంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచవచ్చనే వార్తలు ముందే వచ్చాయి. ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను స్వల్పంగా సవరించాయి. ఇప్పుడు రెపో ఆధారిత వడ్డీ రేట్లు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) వంతు వచ్చింది. రెపో రేటు పెంపుదలకు అనుగుణంగా బ్యాంకులు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ రేట్లను మార్చే అవకాశం ఉంది. మరోవైపు సీఆర్‌ఆర్‌ పెంపుతో బ్యాంకుల దగ్గర నగదు కొరతా ఏర్పడుతుంది. కాబట్టి, ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచి, డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేయొచ్చు. ఈ తరుణంలో మన ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది ముఖ్యం.

దీర్ఘకాలిక డెట్‌ ఫండ్లలో..: డెట్‌ ఫండ్లలో వివిధ రకాలుంటాయి. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో లిక్విడ్‌ ఫండ్లు లేదా షార్ట్‌ టర్మ్‌ ఫండ్లను ఎంచుకోవడం మేలు. దీర్ఘకాలిక ఫండ్లతో పోలిస్తే వీటిలో కాస్త తక్కువ హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు బాండ్ల రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, దీర్ఘకాలిక బాండ్లలో మదుపు చేస్తున్న ఫండ్లకు దూరంగా ఉండటం మంచిది. కాబట్టి, ఇప్పటికే మీరు ఇలాంటి పథకాల్లో మదుపు చేస్తుంటే.. వాటిని వెనక్కి తీసుకొని, స్వల్పకాలిక వ్యవధి ఉన్న డెట్‌ పథకాలకు మళ్లించే ప్రయత్నం చేయొచ్చు.

తక్కువ రేటింగ్‌తో..: వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కార్పొరేట్‌ బాండ్లు, కార్పొరేట్‌ డిపాజిట్లవైపు చాలామంది మొగ్గు చూపారు. సాధారణంగా ఏఏఏ, ఏఏ, ఏ, ఏ+ రేటింగ్‌ ఉన్న బాండ్లు, డిపాజిట్లు సురక్షితంగా చెప్చొచ్చు. కానీ, వీటిలో కాస్త తక్కువ వడ్డీ వస్తుంది. నష్టభయం ఉన్న బీ, సీ, డీ రేటింగ్‌లు ఉన్న వాటికి అధిక వడ్డీ వస్తుంది. దీంతో అధిక వడ్డీ కోసం కొందరు నష్టభయం ఉన్న బాండ్లను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతున్న దశలో ఉన్నాం కాబట్టి, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అత్యధిక రేటింగ్‌ ఉన్న వాటికి ఇప్పుడు మీ పెట్టుబడులను మళ్లించాలి. తక్కువ రేటింగ్‌ ఉన్న బాండ్లు, డిపాజిట్ల నుంచి వీలును బట్టి, బయటకు వచ్చేందుకు ప్రయత్నించాలి.

రుణాల బదిలీ..: రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. కొత్తగా ఇల్లు కొనాలనుకున్నా, కారు తీసుకోవాలనుకున్నా ఇదే తరుణంగా భావించవచ్చు. ప్రస్తుతం గృహరుణాలు ఇంకా 7.5శాతం దరిదాపుల్లోనే ఉన్నాయి. కారుపై రుణం 8.5 శాతం లోపే ఉంది. కొన్ని బ్యాంకులు వాహన రుణాలపై ఇటీవల కాలంలో కొన్ని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. 7%-7.5% రుణాలను ఇస్తామని చెబుతున్నాయి. వీటిని ఒకసారి గమనించండి. ఇప్పటికే మీరు 9శాతం అంతకన్నా ఎక్కువ వడ్డీకి రుణాలను తీసుకొని, ఉంటే.. వాటిని తక్కువ వడ్డీకి రుణాలను ఇస్తున్న బ్యాంకులకు మార్చుకునే ప్రయత్నం చేయండి.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉంటే..: వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కాస్త అధిక రాబడి వచ్చేందుకు అవకాశం ఉంది. దీన్ని వదులుకోవద్దు. కొత్తగా డిపాజిట్‌ చేస్తున్న వారు ఎక్కడ అధిక వడ్డీ లభిస్తుందో వేచి చూసి, నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే డిపాజిట్‌ కొనసాగిస్తున్నవారు కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ఉదాహరణకు మీ డిపాజిట్‌పై ఇప్పుడు 5.5శాతం వడ్డీ వస్తుందనుకుందాం. వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత 5.75శాతం వచ్చినా మరీ అధిక ప్రయోజనం ఏమీ ఉండదు. మార్చుకోవాలనుకుంటే అపరాధ రుసుమూ ఉంటుంది. వడ్డీ రేట్లు కనీసం 1 శాతం నుంచి 1.5 శాతం పెరిగినప్పుడు దీని గురించి తప్పనిసరిగా ఆలోచించాలి. ఈ మేరకు పెరగడానికి ఇంకా కాస్త సమయం ఉంది.

చిన్న మొత్తాల పొదుపు..: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, జాతీయ పొదుపు పత్రాల వంటివి పూర్తి సురక్షితంగా ఉండే రాబడి హామీ పథకాలు. వీటిలో మదుపు చేసినప్పుడు సెక్షన్‌ 80సీ ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపూ లభిస్తుంది. ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో వీటిపై వడ్డీ పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి, చిన్న మొత్తాలపై ఆసక్తి ఉన్న వారు వీటిని తిరిగి పరిశీలించవచ్చు.

వేగంగా తీర్చేయండి..: రెపో రేటు పెంపు ప్రభావం అధికంగా గృహరుణాలపైనే ఉంటుంది. కాబట్టి, దీర్ఘకాలం కొనసాగే ఈ అప్పును సాధ్యమైనంత వేగంగా తీర్చేయడానికి ప్రయత్నించండి. రుణం తీసుకున్న కొత్తలో మనం చెల్లించే వాయిదాల్లో వడ్డీ మొత్తమే అధికంగా ఉంటుంది. అసలు నామమాత్రంగానే తగ్గుతుంది. ఉదాహరణకు రూ.25లక్షల గృహరుణాన్ని 7.25శాతం వడ్డీకి 20 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారనుకుందాం. అప్పుడు నెలకు రూ.19,759.41 చొప్పున ఏడాదికి రూ.2,37,113 చెల్లిస్తాం. ఇందులో తొలి ఏడాదిలో వడ్డీ రూ.1,79,356 ఉంటే.. అసలు రూ.57,757 మాత్రమే. కాబట్టి, వడ్డీ భారం తగ్గించుకునేందుకు ఏటా అసలులో 5-10 శాతం చెల్లించడం లేదా అదనంగా ఒక ఈఎంఐని అసలుకు జమ చేయడంలాంటివి చేయాలి. రుణం రెండు మూడేళ్లలో తీరబోతున్న వారికి వడ్డీ రేట్లు పెరిగినా పెద్దగా భారం ఉండదు.

ఇదీ చదవండి: టాటా ఏస్‌ ఈవీ.. ఒక్కసారి ఛార్జింగ్​తో 154 కిలోమీటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.