ETV Bharat / business

'జూన్​లో జీఎస్​టీ వసూళ్లు 56% జంప్​.. ఎగుమతి పన్ను అందుకే!' - జీఎస్​టీ వసూళ్లు

GST collections: జీఎస్​టీ వసూళ్లు జూన్​లో రూ. 1.44 లక్షల కోట్లుగా నమోదైనట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. రూపాయి విలువ పతనం అవుతున్న తరుణంలో.. ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం, రిజర్వ్​ బ్యాంకు నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

GST collections up 56 pc to Rs 1.44 lakh cr in June: FM

author img

By

Published : Jul 1, 2022, 3:26 PM IST

GST collections: వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు జూన్​లో రూ. 1.44 లక్షల కోట్లుగా నమోదైనట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. జీఎస్​టీ ఆదాయం గతేడాది ఇదే నెల కంటే 56 శాతం పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుత రోజుల్లో ఇంత మొత్తం రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇదే ఏడాది మే నెలలో జీఎస్​టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు పతనమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రభుత్వం, రిజర్వ్​ బ్యాంకు ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. దిగుమతులపై రూపాయి విలువ ప్రభావాన్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు వివరించారు.

విదేశాలకు ఎగుమతి చేస్తున్న పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం.. ఎగుమతి పన్ను విధించింది. ఈ నేపథ్యంలో స్పందించిన నిర్మల.. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ముడి చమురు, డీజిల్​, విమాన ఇంధనంపై విధించే కొత్త పన్నులను ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఓసారి సమీక్షిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కఠిన సమయం నడుస్తుందని.. అంతర్జాతీయంగా ఇంధన ధరలు హద్దుల్లేకుండా పెరుగుతున్నాయని అన్నారు.

''ఇది ఎగుమతులను నిరుత్సాహపరచాలని తీసుకున్న నిర్ణయం కాదు. దేశీయ లభ్యతను పెంచాలని ప్రభుత్వం కోరుకుంటోంది.''

- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

ఇవీ చూడండి: నేటి నుంచి ఈ కొత్త మార్పులు అమలు.. అవేంటో తెలుసుకోండి

'జీఎస్​టీ'కి ఐదేళ్లు.. నెలకు రూ.లక్ష కోట్లకు పైగా వసూళ్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.