Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.40 తగ్గి.. ప్రస్తుతం రూ.54,360 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర 350 తగ్గి.. ప్రస్తుతం రూ.63,850 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.54,360గా ఉంది. కిలో వెండి ధర రూ.63,850 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,360 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,850 గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,360గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,850 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,360వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,850 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,758 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.44 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,39,068 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.13,39,068 |
ఇథీరియం | రూ.95,709 |
టెథర్ | రూ.81.48 |
బినాన్స్ కాయిన్ | రూ.24,252 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.52 |
స్టాక్ మార్కెట్లు:
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టంతో 62,252 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 18,479 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్టీ, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాసెమ్కో, ఎన్టీపీసీ, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఐసీఐసీఐ, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ:
రూపాయి విలువ 16 పైసలు పెరిగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.54 వద్ద ట్రేడవుతోంది.