ETV Bharat / business

Flipkart Big Billion Days Start Date : ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలివే.. ఆ ప్రొడక్ట్స్​పై 90 శాతం డిస్కౌంట్ - ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ 2023

Flipkart Big Billion Days Start Date : 'బిగ్​ బిలియన్​ డేస్​' తేదీలను ప్రకటించింది ఫ్లిప్​కార్ట్. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రత్యేక సేల్​లో.. ఎప్పటిలాగే భారీ ఆఫర్లను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రకాల వస్తువులపై 80 నుంచి 90 శాతం వరకు ఆఫర్లు ఉండనున్నట్లు తెలిపింది. మరి ఏఏ వస్తువులపై ఎంత వరకు ఆఫర్లు ఉన్నాయి? మొబైల్​ ఫోన్లపై ఎంత తగ్గింపు ఉంటుంది? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

flipkart-big-billion-days-start-date-2023-offers-and-discount
ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 తేదీ
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 12:36 PM IST

Flipkart Big Billion Days Start Date : ఆన్​లైన్​ షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వచ్చేశాయి. పండగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో.. స్పెషల్​ సేల్‌కు సిద్ధమైంది ఫ్లిప్‌కార్ట్‌. ఈ 'బిగ్‌ బిలియన్‌ డేస్'లో వివిధ రకాల వస్తువులపై భారీ ఆపర్లను ఫ్లిప్‌కార్ట్‌ ఇవ్వనుంది.

ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఓ మైక్రోసైట్‌ను క్రియేట్‌ చేసి వివిధ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. తాజాగా అక్టోబర్‌ 08 నుంచి అక్టోబర్‌ 15 వరకు ఈ 'బిగ్‌ బిలియన్‌ డేస్' సేల్‌ జరగనుందని వెల్లడించింది. ఈ సేల్​లో భాగంగా ఐఫోన్‌ 13, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54, పిక్సెల్‌ 7ఏ సహా వివిధ ఎలక్ట్రానిక్, ఫ్యాషన్‌, బ్యూటీ, గృహోపకరణాలపై ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే ప్రకటించింది.

ఐఫోన్‌ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌54, పిక్సెల్‌ 7ఏ, పోకో ఎక్స్‌5 ప్రో, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో, శాంసంగ్‌ గెలాక్సీ ఏ34, పోకో ఎఫ్‌5, శాంసంగ్‌ గెలాక్సీ ఏ23, ఒప్పో రెనో 10, మోటోరోలా ఎడ్జ్‌ 40, మోటోరోలా జీ54, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీగా తగ్గింపు ఉండనున్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. మోటోపై సెప్టెంబర్‌ 28న, వివోపై 29న, ఇన్ఫీనిక్స్‌పై 30న, రియల్‌మీపై అక్టోబర్‌ 02న, శాంసంగ్‌పై 3న, పోకోపై 4న, గూగుల్‌ పిక్సెల్‌పై అక్టోబర్‌ 05న, రెడ్‌మీ ఫోన్లపై అక్టోబర్‌ 05న ఆఫర్లను ప్రకటించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.

వివో టీ2 ప్రో 5జీ, మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ, పిక్సెల్‌ 8 సిరీస్‌, వివో వీ29 సిరీస్‌, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌34 5జీ ఫోన్లు బిగ్‌ బిలియన్‌ సేల్‌లో భాగంగా విడుదల కానున్నాయి. వీటితో పాటు ఇటీవలే విడుదలైన మోటో జీ54 5జీ, రియల్‌మీ సీ51, గెలాక్సీ ఎఫ్‌34 5జీ ఫోన్లపై కూడా రాయితీ లభించనుంది. ఐఫోన్‌ 14 సిరీస్‌, ఐఫోన్ 13, గూగుల్‌ పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 6 మోడళ్లపై సైతం ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

వీటిపై 80 నుంచి 90 శాతం వరకు తగ్గింపు..

  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ యాక్సెసరీస్‌పై 50-80% వరకు ఆఫర్‌ ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.
  • పాదరక్షలు, సంప్రదాయ దుస్తులు, ఆభరణాల వంటి ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 90 శాతం వరకు ఆఫర్లు ఉన్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది.
  • బ్యూటీ ప్రొడక్ట్స్‌పైన 60- 80శాతం వరకు రాయితీ లభించనున్నట్లు ఫ్లిప్​కార్ట్ పేర్కొంది.
  • హోమ్‌డెకర్‌ విభాగంలో 80 శాతం, ఫర్నీచర్‌పై 85శాతం వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది.
  • రిఫ్రిజిరేటర్లపై 70శాతం, 4కే స్మార్ట్‌ టీవీలపై 75 శాతం వరకు రాయితీ ఉండొచ్చు.
  • వాషింగ్‌ మెషీన్లు రూ.5,000 నుంచే లభించనున్నట్లు వెబ్‌సైట్‌లో తెలిపింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి ఆయా ఉత్పత్తులపై తగ్గింపు కూడా ఉంటుందని తెలిపింది.

Honda New Bike launch : అదిరే ఫీచర్లతో.. హోండా ఎస్​పీ 125, బజాజ్​ పల్సర్​ ఎన్​150 బైక్స్ లాంఛ్​.. ధర ఎంతంటే?

Travel Now Pay Later : టూర్​ కోసం ప్లాన్ చేస్తున్నారా?.. చేతిలో డబ్బులు లేవా?.. అయితే TNPL లోన్​ ట్రై చేయవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.