E Pan Download Online : ప్రస్తుత రోజుల్లో పాన్ కార్డ్ లేనివారుండరు. దాదాపు 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరి దగ్గర పాన్ కార్డు కచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవాలన్నా.. లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలన్నా పాన్ కార్డ్ అనేది తప్పనిసరి ధ్రువపత్రంగా మారిపోయింది. అయితే ఎప్పుడు? ఏ సమయంలో మనకి పాన్ కార్డ్ అవసరం పడుతుందో చెప్పలేము. ఒక్కోసారి అత్యవసర సమయాల్లో కూడా దీనిని వాడే సందర్భాలు వస్తాయి. అలాంటప్పుడు మన దగ్గర భౌతిక(ఫిజికల్) పాన్ కార్డ్ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మన పనులు చకచకా జరిగిపోతాయి. లేకుంటేనే సమస్య వచ్చి పడుతుంది. అప్పుడు మన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి చిన్న విషయానికే మన ముఖ్యమైన పనులు ఆగిపోనివ్వకుండా చేస్తున్నాయి దేశంలో పాన్ కార్డ్‌లను జారీ చేసే NSDL(నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్), UTIITSL(యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్) సంస్థలు.
తమ అధికారిక పోర్టల్ లేదా వెబ్‌సైట్ నుంచి నేరుగా సదరు వ్యక్తి పాన్ కార్డ్‌ను ఆన్లైన్లో( How To Download E Pan Online )నే డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. మనం ఎక్కడికి వెళ్లినా మన ఫోన్లోనే ఈ ఈ-పాన్ కార్డ్‌ను భద్రపరుచుకోవచ్చు. దీంతో మన పనులు సకాలంలో పూర్తవుతాయి. అయితే మరి ఆన్లైన్లో ఈ-పాన్‌కార్డ్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ-పాన్ కార్డ్ అంటే..?
What Is E Pan Card : ఈ-పాన్ కార్డ్ అనేది మీ భౌతిక పాన్ కార్డ్‌కు ఓ డిజిటల్ వెర్షన్. ఫిజికల్‌గా మన దగ్గరే ఉంచుకునే బదులుగా దీనిని మొబైల్ ఫోన్లోనే భద్రపరుచుకొని మన అవసరాలను తీర్చుకోవచ్చు.
NSDL నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ ఇలా..!
- ముందుగా NSDL వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి.
- 'డౌన్లోడ్ ఈ-పాన్ కార్డ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- సంస్థ అడిగే వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. అవి..
- PAN నంబర్
- పుట్టిన తేదీ, సంవత్సరం
- తర్వాత సబ్మిట్ బటన్‌పై నొక్కండి. దీంతో మీ ఈ-పాన్ కార్డ్ జనరేట్ అవుతుంది.
- చివరగా దానిని డౌన్లోడ్ చేసుకోండి.
వీరు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు..!
- కొత్తగా PAN కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు లేదా UTIITSL ద్వారా ఇటీవలే కార్డులో కరెక్షన్స్ చేయించుకున్న వారు మాత్రమే ఈ-పాన్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో వ్యక్తికి సంబంధించిన వ్యాలిడ్ మొబైల్ నంబర్‌తో పాటు రిజిస్టర్డ్ ఈ-మెయిల్ వంటి పూర్తి వివరాలు ఉంటేనే ఈ-పాన్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
ఫీజు ఏమైనా చెల్లించాలా..?
E Pan Online Download Charges : ఎటువంటి అనుబంధ ఛార్జీలు లేకుండానే UTIITSL వెబ్‌సైట్ ద్వారా ప్రతిఒక్కరూ తమ ఈ-పాన్‌ను PDF ఫార్మాట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రీ సర్వీస్ కేవలం గతనెలలో కొత్తగా పాన్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి లేదా ఇటీవలే పాన్‌లో మార్పులు చేయించుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..!
- ఈ-పాన్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈ-మెయిల్‌కు ఓ లింక్‌ను పంపిస్తారు. ఇలా వచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్‌కు లేదా మెయిల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి డిజిటల్ పాన్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అయితే వినియోగదారుడు మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌ను ఇప్పటికీ నమోదు చేసుకోనట్లయితే వారు ముందుగా కరెక్షన్స్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే ఈ-పాన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ప్రతి వినియోగదారుడికి అందించిన లింక్ ద్వారా ఆన్లైన్లో ఈ-పాన్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు గరిష్ఠంగా మూడు అవకాశాలు మాత్రమే కల్పించారు. కాగా, ఈ లింక్ వ్యాలిడిటీ ఒక నెల వరకు ఉంటుంది.
నోట్- వినియోగదారుడు ఈ సేవలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.