ETV Bharat / business

'పన్ను' ఆదా చేద్దామనుకుంటున్నారా?.. ఈ పొరపాట్లు చేయొద్దు! - ఆర్థిక సంవత్సంరం

ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలల సమయం ఉంది. సాధారణంగా ఇప్పటికే పన్ను ప్రణాళికలు పూర్తి చేయాలి. కొంతమంది చివరి నిమిషం వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా వేచి చూస్తుంటారు. ఫలితంగా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పథకాల ఎంపికలో కొన్ని పొరపాట్లూ దొర్లుతాయి. పన్ను మినహాయింపు లభించినా, లక్ష్య సాధనలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.

tax planning
tax planning
author img

By

Published : Dec 23, 2022, 7:21 PM IST

ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పుడే పన్ను భారం తగ్గించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు ఉండాలి. చివరి నిమిషం వరకూ ఆలోచించకపోతే.. పెట్టుబడుల విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. జాగ్రత్తగా విశ్లేషించుకునే వ్యవధి ఉండదు. వీటిని నివారించేందుకు ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం...

పన్ను ఎంత చెల్లించాలి?
ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇదే. 2022-23 ఆర్థిక సంవత్సరం (2023-24 అసెస్‌మెంట్‌ ఇయర్‌)కు సంబంధించి మీరు ఎంత పన్ను చెల్లించాలి అనేది చూడండి. మీ మొత్తం ఆదాయం, పన్ను శ్లాబు తెలుసుకోండి. వేతనం, వ్యాపారం, డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా వచ్చిన స్వల్ప, దీర్ఘకాలిక లాభాలు, బహుమతులు ఇలా అన్ని మార్గాల్లో వచ్చిన ఆదాయాన్ని లెక్కించాలి. ఆదాయపు పన్ను శాఖకు మీ ప్రతి వివరం తెలుస్తుందని మర్చిపోవద్దు. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లో మీ ఆదాయం, అధిక విలువగల లావాదేవీలన్నీ ఉంటాయి. మీ కార్యాలయం అకౌంట్స్‌ విభాగంతో మాట్లాడి, మీరు ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆదా చేసుకునేందుకు ఉన్న అవకాశాలేమిటి తెలుసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడి కోసం ఏ పథకాలు ఎంపిక చేసుకోవాలన్నది నిర్ణయించుకోవచ్చు. గృహరుణంపై చెల్లించే వడ్డీ, ఈపీఎఫ్‌, జీవిత బీమా ప్రీమియాలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు తదితరాలన్నీ లెక్కించిన సెక్షన్‌ 80సీ పరిమితి చేరుకునేందుకు ఎంత మదుపు చేయాలన్నది చూసుకోవాలి.

అవసరం లేకుండా తీసుకోవద్దు..
పన్నులు ఆదా చేయడానికి అనేక మార్గాలున్నా.. చాలామంది బీమా పాలసీలనే విశ్వసిస్తారు. పన్ను ఆదా అనేది బీమా పాలసీలు కల్పించే ఒక అదనపు ప్రయోజనంగానే గుర్తించాలి తప్ప, పూర్తిగా వీటిపైనే ఆధారపడటం వల్ల మన ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయి. వార్షికాదాయానికి కనీసం 12 రెట్ల వరకూ బీమా ఉండేలా చూసుకోండి. దీనికోసం సంప్రదాయ పాలసీల్లాంటివి కాకుండా, టర్మ్‌ పాలసీని తీసుకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప ప్రీమియం అధికంగా ఉండే పాలసీలను తీసుకొని, ఆ తర్వాత ఏడాది ప్రీమియం చెల్లించలేక ఇబ్బందులు పడటం ఎట్టి పరిస్థితులోనూ ఆచరణీయం కాదు.

రాబడి అంచనా లేకుండా..
పన్ను ఆదా పథకాల్లో రాబడి ఎంత వస్తుంది అన్నదీ కీలకమే. సురక్షిత పథకాల్లో పొదుపు చేసినప్పుడు రాబడి హామీ ఉంటుంది. మార్కెట్‌ ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు రాబడిపై కచ్చితమైన అంచనాలుండవు. ఉదాహరణకు వీపీఎఫ్‌పై 8.1 శాతం రాబడి అందుతోంది. పీపీఎఫ్‌పై 7.10 శాతం వడ్డీ అందుతోంది. వీటి రాబడిపై పన్ను ఉండదు. కొన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు 10-15 శాతం వరకూ రాబడినిస్తున్నాయి. కొన్ని పథకాల్లో మదుపు చేసినప్పుడు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ, వచ్చిన రాబడి/వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. కాబట్టి, పన్ను ఆదా పథకాలను ఎంచుకునేటప్పుడు ఈ అంశాన్నీ గుర్తుంచుకోవాలి.

పొదుపు సరిపోదు..
సురక్షితంగా ఉండే పొదుపు పథకాల్లో మాత్రమే మదుపు చేస్తాం... అంటే పన్ను ఆదా అవుతుంది కానీ, దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సమకూర్చుకోలేం. కాబట్టి, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉండేలా చూసుకోండి. మంచి పొదుపు-పెట్టుబడి పథకాల మిశ్రమంగా మీ జాబితా ఉండాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. చివరగా ఒక మాట.. పథకం ఏదైనా సరే. దాని గురించి పూర్తి అవగాహన లేకుండా ఎంచుకోవద్దు. మీకు స్పష్టత వచ్చాకే పెట్టుబడి నిర్ణయం తీసుకోండి.

వ్యవధి తెలుసుకోండి..
అన్ని పన్ను ఆదా పథకాల్లో కనీసం ఇంతకాలం కొనసాగాలనే నిబంధన ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్లు అందించే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పెట్టుబడిని కనీసం మూడేళ్లపాటు కొనసాగించాలి. బ్యాంకులో పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసినప్పుడు అయిదేళ్లు వెనక్కి తీసుకోలేం. బీమా పాలసీలకూ నిర్ణీత వ్యవధి ఉంటుంది. కాబట్టి, వ్యవధి గురించి అవగాహన లేకుండా పన్ను ఆదా పథకాలను ఎంచుకుంటే.. తర్వాత వెనక్కి తీసుకోవాలన్నా కుదరదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.