ETV Bharat / business

Commercial LPG Prices Cut : కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్​ వినియోగదారులకు గుడ్​ న్యూస్​.. సిలిండర్​పై రూ.158 తగ్గింపు! - అమరావతిలో ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్ ధర ఎంత

Commercial LPG Prices Cut News In Telugu : ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMC) కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్​ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల సిలిండర్​ ధరను రూ.158 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Commercial LPG Prices today
Commercial LPG Prices Cut
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 9:55 AM IST

Updated : Sep 1, 2023, 10:41 AM IST

Commercial LPG Prices Cut : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్​ ఎల్​పీసీ గ్యాస్ వినియోగదారులకు గుడ్​ న్యూస్ చెప్పింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్​ సిలిండర్​ ధరను రూ.158 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గించిన ధరలు నేటి (సెప్టెంబర్​ 1) నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

నగరాలు - గ్యాస్ సిలిండర్​ ధరలు
Commercial LPG Gas Price Today :

  • కొత్త ధరలు నేటి నుంచే అమలు కావడం వల్ల దిల్లీలో రిటైల్​ 19కేజీ కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ.1,522కు చేరుకుంది.
  • కోల్​కతాలో రిటైల్​ 19కేజీ కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ.1,644.50కు చేరుకుంది. చెన్నైలో రూ.1694.50, హైదరాబాద్​లో రూ.1760, విజయవాడలో రూ.1692.50గా సిలిండర్​ ధర ఉంది.

నోట్​ : ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు ఆగస్టు నెలలోనూ కమర్షియల్ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరను రూ.100 మేర తగ్గించాయి.

రక్షా బంధన్​ కానుక
Domestic Gas Cylinder Price : కేంద్ర ప్రభుత్వం రక్షా బంధన్​ కానుకగా ఆగస్టు 29న వంట గ్యాస్​ ధరలను రూ.200 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వంట గ్యాస్​ వినియోగదారులందరీ ముఖ్యంగా మహిళలకు లబ్ధి చేకూరినట్లు అయ్యింది.

ప్రతి నెలా మొదటి రోజున..
Gas Price Revision India : వాస్తవానికి ప్రతి నెలా మొదటి రోజున గ్యాస్​, చమురు ధరలను రివైజ్​ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMC) కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్​ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఎల్​పీజీ సిలిండర్​ ధరలను ఎలా, ఎక్కడ చెక్​ చేయవచ్చు?
How To Check LPG Gas Rate Online : ఎల్​పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే.. ఇండియన్ ఆయిల్​ అధికారిక వెబ్​సైడ్​ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్​సైట్​లో ఎల్​పీజీ ధరలతోపాటు, జెట్​ ఫ్యూయెల్​, ఆటో గ్యాస్​, కిరోసిన్​ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.

ఎల్​పీజీ దిగుమతులపై అగ్రి సెస్​​ మినహాయింపు
Agri Cess On Gas Imports In India : కేంద్ర ప్రభుత్వం ఎల్​పీజీ, లిక్విఫైడ్ ప్రొపేన్​, లిక్విఫైడ్ బ్యూటేన్​ దిగుమతులపై ఉన్న 15 శాతం అగ్రి సెస్​పై మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు సెప్టెంబర్​ 1 నుంచే అమలులోకి రానున్నట్లు స్పష్టం చేసింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ జులై నెలలో ఎల్​పీజీ, లిక్విఫైడ్​ ప్రొపేన్​, లిక్విఫైడ్​ బ్యూటేన్ దిగుమతులపై 15 శాతం వరకు అగ్రి సెస్ విధించింది. తాజాగా ఆ అగ్రి సెస్​ నుంచి మినహాయింపు ఇచ్చింది.​

Last Updated : Sep 1, 2023, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.