Central Govt Plans GST on Credit Card Cashbacks ! : గతంలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు బ్యాంకులే వెంటపడి మరీ కార్డులు ఇచ్చేస్తున్నాయి. మెరుగైన క్రెడిట్ స్కోర్(Credit Score) ఉంటే చాలా సులువుగా ఈ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. దాంతో ప్రస్తుతం తగిన సంపాదన ఉండి బ్యాంకు అకౌంట్ ఉన్న చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే.. క్రెడిట్ కార్డు వాడడం వల్ల రివార్డు పాయింట్లు వస్తుంటాయి. క్యాష్ బ్యాక్స్ కూడా వస్తుంటాయి. మరి, వీటిపై ఆదాయపు పన్ను ఉంటుందా? జీఎస్టీ వర్తిస్తుందా? అనే డౌట్ చాలామందికి వ్యక్తమవుతోంది. మరి, వాటిపై పన్ను విధిస్తారా లేదా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Tax on Credit Card Reward Points : చాలా ఫైనాన్స్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు క్రెడిట్ కార్డుల(Credit Cards) వినియోగంపై రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్‌లు, కొనుగోళ్లపై తక్షణ తగ్గింపులు, ఉచిత మెంబర్‌షిప్స్, సినిమా టికెట్లపై తగ్గింపులు లాంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే.. క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా పొందే ఈ ప్రయోజనాలపై, రివార్డులపై పన్ను విధిస్తారనే విషయాన్ని యూజర్లు గమనించాలి. ఎందుకంటే వాటిని ఇన్‌కం ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద వర్గీకరిస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
ఎవరైనా క్రెడిట్ కార్డు హోల్డర్ ఒక ఆర్థిక సంవత్సరంలో తాను పొందిన మొత్తం క్యాష్‌బ్యాక్(Credit Card Cashbacks) రూ.50,000 దాటి ఉంటే అది పన్ను పరిధిలోకి వస్తుందని ఇన్‌కం ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డు కంపెనీలు రివార్డ్‌లు లేదా 5వేల రూపాయల కంటే ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లపై 10 శాతం చొప్పున TDSని మినహాయించుకుంటాయి. అదే విధంగా క్రెడిట్ కార్డు వినియోగదారులు ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద తగ్గింపులు, మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా రివార్డ్‌లపై పన్ను బాధ్యతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
GST on Credit Card Cashbacks : కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో క్రెడిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్ల వల్ల పొందే క్యాష్‌బ్యాక్‌పై జీఎస్టీని వేసేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం. అయితే గతంలో కేవలం కార్డు ఛార్జీలు, ఫీజుపై మాత్రమే జీఎస్టీ ఉండేది. చెల్లించాల్సిన మెుత్తంపై మాత్రం అప్పుడు జీఎస్టీ(Goods and Service Tax) వర్తించేది కాదు. కానీ, ప్రస్తుతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లను మార్కెటింగ్ బ్రాండింగ్ సర్వీస్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర సర్కార్ భావిస్తుంది. అదే విధంగా దీనికి అనుగుణంగా జీఎస్టీ పరిధిని విస్తరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు తీసుకున్న వారు పలు సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా వాడుకుంటే మంచిది.
క్రెడిట్ కార్డును అతిగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? తెలియకుండానే ఎన్ని ఛార్జీలు వేస్తున్నారో తెలుసా?