2023 October Launched And Upcoming Bikes In India : భారతీయ మార్కెట్లో టూవీలర్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ బైక్‌లను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. పైగా ఇప్పుడు పండుగ సీజన్. అందుకే ఈ అక్టోబర్ నెలలో చాలా మంచి బైక్‌లను మార్కెట్లోకి విడుదల అయ్యాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యమహా ఏరోక్స్ 155 లాంఛ్
Yamaha Aerox 155 : రీసెంట్‌గానే ఈ మోడల్ బైక్ భారతీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ధరను రూ.1,48,300(ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది యమహా కంపెనీ. ఈ మోడల్ బైక్ బ్లాక్, రేసింగ్ బ్లూ, గ్రే వెర్మిలియన్, సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉంది. ఇది 14.7 bhp పవర్, 13.9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మరిన్ని అధునాతన ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి.
ఈప్లూటో 7జీ మ్యాక్స్..
Epluto 7g Max : కొద్ది రోజుల క్రితమే ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటీ మార్కెట్లోకి విడుదలైంది. దీని ధర రూ.1.14 లక్షలుగా ఉంది. ఈ స్కూటీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హిల్‌స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ లాంచి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో ఈ స్కూటీ అందుబాటులో ఉంది. ఈ బైక్‌లో 3.5kWh హెవీ-డ్యూటీ బ్యాటరీని పొందుపరచడం జరిగింది.
త్వరలో లాంఛ్ కానున్న సరికొత్త బైక్స్!
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X..
Triumph Scrambler 400X : బజాజ్ కంపెనీ సహకారంతో ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X బైక్ రూపుదిద్దుకుంది. ఈ అక్టోబర్ నెలలోనే ఇది మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే దీని ధరను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఎక్స్‌షోరూం ధర రూ.2.23లక్షలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 398 సీసీ ఇంజిన్ సామర్థాన్ని ఈ బైక్ కలిగి ఉంది. 40bhp పవర్, 38Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో మొత్తం ఆరు గేర్లు ఉంటాయి. ఈ మోడల్ బైక్ స్పీడ్ 400పైగానే ఉండొచ్చు.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450..
Royal Enfield Himalayan 450 : అక్టోబర్ నెలాఖరుకు ఈ బైక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాల చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ. 450సీసీ ఇంజిన్ సామర్థ్యంతో హిమాలయన్ 450 మోడల్ బైక్‌ను తయారుచేసింది కంపెనీ. 40bhp పవర్‌ను ఈ బైక్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ఫీచర్స్ వివరాలను రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఏథర్ 450X..
Aether 450X : ఏథర్ 450Xను అక్టోబర్‌లోనే వినియోగదారుల ముందుకు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది ఏథర్ ఎనర్జీ కంపెనీ. 3.7kWh బ్యాటరీ సామర్థ్యంతో ఏథర్ 450X రూపుదిద్దుకుంది. ఈ మధ్య కాలంలోనే మార్కెట్లోకి విడుదలైన ఏథర్ 450Sకు స్వల్ప మార్పులు చేసి ఈ బైక్‌ను తయారు చేసింది కంపెనీ.
Suzuki Grand Vitara Vs Kia Carens : సుజుకీ గ్రాండ్ విటారా Vs కియా కారెన్స్.. ఫీచర్స్ చూశారా..?