Best Cars Under 8 Lakh : భారతదేశంలో రోజురోజుకూ కార్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమ దైనందిన, వ్యాపార అవసరాల కోసం మంచి కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లో, మంచి లుక్స్‌తో, బెస్ట్ ఫీచర్స్, స్పెక్స్‌తో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను రూపొందించి, మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.8 లక్షల బడ్జెట్లోని టాప్-10 కార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Tata Punch Features : ఈ టాటా పంచ్ అనేది ఒక 5 సీటర్ ఎస్యూవీ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6000 rpm వద్ద 86.63 bhp పవర్, 3350 rpm వద్ద 115 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు సీఎన్జీ ఆప్షన్లోనూ లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ 18.8 kmpl, సీఎన్జీ వేరియంట్ 26.99 km/kg మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 33 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఇది మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ ఎక్స్టర్, మారుతి స్విఫ్ట్ కార్లతో పోటీపడుతోంది.
Tata Punch Price : మార్కెట్లో ఈ టాటా పంచ్ కారు ధర రూ.5.99 లక్షల నుంచి రూ.10.09 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Maruti Swift Features : ఈ మారుతి స్విఫ్ట్ అనేది ఒక 5 సీటర్ హ్యాచ్‌బ్యాక్ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6000 rpm వద్ద 85.50 bhp పవర్, 4400 rpm వద్ద 113 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు సీఎన్జీ ఆప్షన్లోనూ లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ 22.38 kmpl, సీఎన్జీ వేరియంట్ 30.9 km/kg మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 11 వేరియంట్లలో, 10 అందమైన రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో ఇది నేరుగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా పంచ్ కార్లతో పోటీపడుతోంది.
Maruti Swift Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ధర సుమారుగా రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Kia Sonet Features : ఈ కియా సోనెట్ అనేది ఒక 5 సీటర్ ఎస్యూవీ కారు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కార్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కారు 4000 rpm వద్ద 114 bhp పవర్, 4200 rpm వద్ద 115 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్‌కు 18-19 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 19 వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా XUV300లతో పోటీపడుతోంది.
Kia Sonet Price : మార్కెట్లో ఈ కియా సోనెట్ కారు ధర రూ.7.99 లక్షల నుంచి రూ.15.69 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Mahindra XUV300 Features : ఈ మహీంద్రా XUV300 అనేది ఒక 5 సీటర్ ఎస్యూవీ కారు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కార్లు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 3750 rpm వద్ద 115 bhp పవర్, 2500 rpm వద్ద 300 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్‌కు 16.5 - 20.1 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 25 వేరియంట్లలో, 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
Mahindra XUV300 Price : మార్కెట్లో ఈ మహీంద్రా XUV300 కారు ధర సుమారుగా 7.99 లక్షల నుంచి రూ.14.75 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Hyundai Exter Features : ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ అనేది ఒక 5 సీటర్ ఎస్యూవీ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6000 rpm వద్ద 81.80 bhp పవర్, 4000 rpm వద్ద 113 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు సీఎన్జీ ఆప్షన్లోనూ లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ 19.2 kmpl, సీఎన్జీ వేరియంట్ 27.1 km/kg మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 17 వేరియంట్లలో, 9 అందమైన రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీనికి మారుతి బాలెనో, మారుతి బ్రెజ్జా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
Hyundai Exter Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ కారు ధర రూ.6.12 లక్షల నుంచి రూ.10.27 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Nissan Magnite Features : ఈ నిస్సాన్ మాగ్నైట్ అనేది ఒక 5 సీటర్ ఎస్యూవీ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కారు 5000 rpm వద్ద 98.63 bhp పవర్, 3500 rpm వద్ద 96 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్‌కు 17.4 - 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 32 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి హ్యుందాయ్ ఎక్స్టర్, కియా సోనెట్లు పోటీగా ఉన్నాయి.
Nissan Magnite Price : మార్కెట్లో ఈ నిస్సాన్ మాగ్నైట్ కారు ధర సుమారుగా రూ.5.99 లక్షల నుంచి రూ.11.02 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. Renault KWID Features : ఈ రెనో క్విడ్ అనేది ఒక 5 సీటర్ హ్యాచ్‌బ్యాక్ కారు. దీనిలో 1 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కారు 5500 rpm వద్ద 67.06 bhp పవర్, 4250 rpm వద్ద 91 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్‌కు 21.46 - 22.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 11 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఇది మారుతి ఆల్టో కె10, మారుతి ఇగ్నిస్తో నేరుగా పోటీపడుతోంది.
Renault KWID Price : మార్కెట్లో ఈ రెనో క్విడ్ కారు ధర రూ.4.69 లక్షల నుంచి రూ.6.44 లక్షల రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. Citroen C3 Features : ఈ సిట్రోయెన్ సీ3 అనేది ఒక 5 సీటర్ ఎస్యూవీ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో మాత్రమే వస్తుంది. ఈ కారు 5500 rpm వద్ద 108.62 bhp పవర్, 3750 rpm వద్ద 115 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్‌కు 19.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 7 వేరియంట్లలో, 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో కియా సోనెట్, హ్యుందాయ్ ఎక్స్టర్ల నుంచి సిట్రోయెన్ సీ3 గట్టిపోటీ ఎదుర్కొంటోంది.
Citroen C3 Price : మార్కెట్లో ఈ సిట్రోయెన్ సీ3 కారు ధర రూ.6.16 లక్షల నుంచి రూ.8.95 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9. Toyota Glanza Features : ఈ టయోటా గ్లాంజా అనేది ఒక 5 సీటర్ హ్యాచ్‌బ్యాక్ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6000 rpm వద్ద 88.50 bhp పవర్, 4400 rpm వద్ద 113 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు సీఎన్జీ ఆప్షన్లోనూ లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ 30.61 kmpl, సీఎన్జీ వేరియంట్ 30.61 km/kg మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 9 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి హోండా అమేజ్, హ్యుందాయ్ వెన్యూ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.
Toyota Glanza Price : మార్కెట్లో ఈ టయోటా గ్లాంజా కారు ధర సుమారుగా రూ.6.81 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10. Honda Amaze Features : ఈ హోండా అమేజ్ అనేది ఒక 5 సీటర్ సెడాన్ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కారు 6000 rpm వద్ద 88.50 bhp పవర్, 4800 rpm వద్ద 110 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్‌కు 18.3- 18.6 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 7 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి హ్యుందాయ్ ఎక్స్టర్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.
Honda Amaze Price : మార్కెట్లో ఈ హోండా అమేజ్ కారు ధర సుమారుగా రూ.7.15 లక్షల నుంచి రూ.9.91 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మంచి స్కూటర్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-10 మోడల్స్ ఇవే!