ETV Bharat / business

ఆర్​బీఐ ఎఫెక్ట్​.. రుణ వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్న బ్యాంకులు - lic loans

Banks Raise Interest Rates: ఆర్​బీఐ పాలసీ రేట్లను పెంచిన నేపథ్యంలో.. పలు బ్యాంకులు, నాన్​-బ్యాంకింగ్​ ఫైనాన్స్​ కంపెనీలు రుణ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. ఎల్​ఐసీ హౌసింగ్​ ఫైనాన్స్​ ప్రాథమిక రుణ రేట్లను 60 బేసిస్​ పాయింట్ల మేర పెంచింది. హెచ్​డీఎఫ్​సీ గృహ రుణాలపై రిటైల్​ రుణ రేటను 50 బీపీఎస్​ పెంచింది.

Banks Raising Loan Interest Rates
Banks Raising Loan Interest Rates
author img

By

Published : Jun 23, 2022, 1:59 PM IST

Banks Raise Interest Rates: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాథమిక రుణ రేట్ల‌ను 60 బేసిస్ పాయింట్లు పెంచింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాల‌సీ రేట్ల‌ను సంబంధిత నెల‌ల్లో 40, 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేప‌థ్యంలో రెండు నెల‌ల్లో రుణ రేట్ల‌ను వ‌రుస‌గా 2 సార్లు పెంపుద‌ల చేసింది.
నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా మే నెల‌లో త‌మ రుణ రేటును (20 బీపీఎస్ పెంచి) 6.90%కి పెంచాయి. త‌న‌ఖా రుణ‌దారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ త‌న ప్ర‌ధాన రుణ రేటును 60 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) పెంచింది. ఇప్పుడు గృహ రుణాల‌పై క‌నీసం 7.50% వ‌డ్డీ రేటును వ‌సూలు చేస్తుంది.

'హెచ్‌డీఎఫ్‌సీ' గృహ రుణాల‌పై రిటైల్ రుణ రేటును 50 బీపీఎస్ పెంచింది. జూన్‌లో 'ఆర్‌బీఐ' పాల‌సీ రెపో రేటును పెంచిన త‌ర్వాత 'ఐసీఐసీఐ బ్యాంకు' 8.60%కు రుణ రేటును పెంచింది. ప్ర‌భుత్వ యాజ‌మాన్యంలోని బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ వ‌డ్డీ రేటును 40 బీపీఎస్ పెంపుతో 7.05%కి పెంచ‌గా, బ్యాంక్ ఆఫ్​ బ‌రోడా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు దాని రెపో లింక్డ్ లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్‌) 7.40%కి పెంచాయి.

ఆర్‌బీఐ పాల‌సీ రేటు పెంచిన‌ప్ప‌టి నుండి అన్ని బ్యాంకులు త‌మ మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్‌) పెంచాయి. కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ జూన్‌లో త‌మ 'ఎంసీఎల్ఆర్ని' 30 నుండి 35 'బీపీఎస్‌' పెంచాయి. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా త‌మ 'ఎంసీఎల్ఆర్‌'ను పెంచాయి.

అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు 'బీపీఎస్‌' పెరుగుద‌ల‌తో రుణ రేట్ల‌ను పెంచిన‌ప్ప‌టికీ ఈ వ‌డ్డీ రేట్లు త‌క్కువ స్థాయిలోనే ఉన్నాయ‌ని దాదాపు అన్ని రుణ సంస్థ‌లు భావిస్తున్నాయి. వ‌డ్డీ రేట్ల పెంపు మార్కెట్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే ఉన్నాయ‌ని, ఖాతాదారుల‌ను ఇప్ప‌టికీ ఈ రుణ రేట్లు మెప్పిస్తాయ‌ని రుణ సంస్థ‌ల నిపుణులు భావిస్తున్నారు. చారిత్రాత్మ‌కంగా పోల్చిన‌ట్ల‌యితే ఈ రేట్లు ఇప్ప‌టికీ చాలా పోటీ స్థాయిలోనే ఉన్నాయి. గృహ రుణాల కోసం డిమాండ్ పెరిగితే అందులో ఇమిడి ఉన్న మార్కెట్ ప‌రిస్థితుల‌తో మొత్తం అన్ని రంగాలకు డిమాండ్ పెరుగుంది. ముఖ్యంగా గృహ రుణ డిమాండ్‌లో అనేక రంగాల జీవ‌నోపాధి ఖ‌చ్చితంగా పెరుగుతుంది. సిబిల్ స్కోర్ మంచి స్థితిలో ఉన్న‌వారికి ఇప్ప‌టికీ తక్కువ గృహ రుణ వ‌డ్డీ రేట్లనే బ్యాంకులు వ‌సూలు చేస్తున్నాయి.

ఇవీ చూడండి: 'ఆమె'గా మారిన ఎలాన్​ మస్క్ కుమారుడు.. పేరు మార్చుకునేందుకు కోర్టుకు

కార్డుల జారీపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆ మార్గదర్శకాల అమలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.