ETV Bharat / business

FDలపై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకు ఎక్కువ ఇస్తోందంటే? - బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు

ఎప్పుడు లేని విధంగా దేశంలోని బ్యాంకులు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. గరిష్ఠంగా 8-8.50 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. చాలా ఏళ్ల తరువాత బ్యాంక్​లు ఈ స్థాయిలో వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. భారీగా డిపాజిట్లను సేకరించేందుకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు పెంచిన ఈ తాజా వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం.

bank-fixed-deposit-interest-rates-2023
బ్యాంక్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 2023
author img

By

Published : Feb 28, 2023, 8:03 PM IST

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ.. ఆ ప్రభావాన్ని అధిగమించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే కస్టమర్​ల నుంచి భారీ స్థాయిలో డిపాజిట్లను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కస్టమర్​ల నుంచి అంతగా స్పందన రావడం లేదు. దానికి కారణం బ్యాంకులు డిపాజిట్లపై తక్కువ వడ్డీలు చెల్లించడమే. ఇది గమనించిన బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీల రేట్లను పెంచాయి. చాలా ఏళ్ల తరువాత ఈ వడ్డీ రేట్లు 8 శాతం దాటాయి. రాష్ట్ర అధ్వర్యంలో నడుస్తున్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మిగతా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తోంది. దేశంలో ఉన్న ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

  • దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయినా స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా.. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. దేశవ్యాప్తంగా 20వేల బ్రాంచీలు కలిగిన ఈ బ్యాంక్​.. సీనియర్​ సిటిజన్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.60 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 400 రోజుల వ్యవధి ఉండే ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఈ వడ్డీని అందిస్తోంది.
  • అన్ని బ్యాంకుల కంటే ఎక్కువగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఎక్కవ వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకు..​ సాధారణ​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 8 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అదేవిధంగా సీనియర్​ సిటిజన్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు 221 రోజుల వ్యవధి ఉండే ఫిక్స్​డ్​ డిపాజిట్లకు వర్తిస్తాయి.
  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తరువాత ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా అందిస్తోంది. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఈ బ్యాంక్.. 7.35 నుంచి 7.85 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 444 రోజుల వ్యవధి ఉండే రిటైల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.35 శాతం వడ్డీని.. సీనియర్ సిటిజన్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.85 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 800 రోజుల వ్యవధి ఉండే రిటైల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.30 వడ్డీని.. సీనియర్​ సిటిజన్ డిపాజిట్లపై 7.80 శాతం వడ్డీని అందిస్తోంది. ​ ​
  • పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కూడా ఓ మాదిరిగానే ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీని చెల్లిస్తోంది. 666 రోజుల వ్యవధితో కూడిన రిటైల్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. అదే విధంగా సీనియర్​ సిటిజన్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
  • బ్యాంక్​ ఆఫ్​ బరోడా సైతం కొత్త వడ్డీ రేట్లతో ముందుకొచ్చింది. 399 రోజుల వ్యవధితో కూడిన రిటైల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీని.. సీనియర్​ సిటిజన్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.75 శాతం అందిస్తోంది.
  • బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కూడా ఈ తరహాలోనే వడ్డీ చెల్లిస్తోంది. 444 రోజుల వ్యవధితో కూడిన రిటైల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీని.. సీనియర్​ సిటిజన్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని అందిస్తోంది.
  • బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర రిటైల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ.. సీనియర్​ సిటిజన్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. 200 రోజుల వ్యవధితో కూడిన​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఈ వడ్డీని చెల్లిస్తోంది.
  • 400 రోజుల వ్యవధితో కూడిన​ రిటైల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై.. కెనరా బ్యాంక్​ 7.15 శాతం వడ్డీని చెల్లిస్తోంది. సీనియర్​ సిటిజన్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై.. 7.65 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 555 రోజుల వ్యవధితో కూడిన రిటైల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై.. ఇండియన్​ బ్యాంక్​ 7 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని అందిస్తోంది.
  • యూకో బ్యాంక్​.. 666 రోజుల వ్యవధితో కూడిన రిటైల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై..​ 7.15 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
  • ఎచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ జనరల్​ పబ్లిక్​ నుంచి స్వీకరించే ఫిక్స్​డ్​ డిపాజిట్లపై కేవలం 7 శాతం మాత్రమే వడ్డీ చెల్లిస్తోంది. సీనియర్​ సిటిజన్స్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని అందిస్తోంది. ఐదు సంవత్సరాల వ్యవధితో కూడిన డిపాజిట్లపై ఈ వడ్డీని చెల్లిస్తోంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్​.. 15 నెలల వ్యవధితో కూడిన ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్స్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.