ETV Bharat / business

5జీ సేవలపై ఎయిర్‌టెల్‌ కీలక ప్రకటన.. వొడాఫోన్​ ఐడియాకు భారీ నష్టం - ఎయిర్​టెల్ న్యూస్

Airtel 5g launch: 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. మరోవైపు టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా.. తొలి త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను ప్రకటించింది.

Airtel 5g launch
Airtel 5g launch
author img

By

Published : Aug 3, 2022, 9:17 PM IST

Airtel 5g launch: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టెలికాం గేర్ల తయారీ సంస్థలైన ఎరిక్సన్‌, నోకియా, శాంసంగ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్‌, నోకియాతో చాలా రోజుల నుంచి ఒప్పందం కొనసాగిస్తోంది. ఈ ఏడాది నుంచి శాంసంగ్‌తోనూ ఒప్పందం కొనసాగనుంది.

ఇటీవల నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 26 GHz బ్యాండ్స్‌లో 19,867.8 MHZ స్పెక్ట్రమ్‌ను రూ.43,084 కోట్లకు ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ గోపాల్‌ ప్రకటించారు. 5జీ కనెక్టివిటీని వినియోగదారులకు అందించేందుకు ప్రపంచంలోనే పేరొందిన టెక్నాలజీ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.

5జీ స్పెక్ట్రమ్‌ వేలం 7 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 10 బ్యాండ్‌లలో మొత్తం 72,098 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి ఉంచగా.. 51,236 మెగాహెర్ట్జ్‌ (71 శాతం) మేర విక్రయమైందని, తొలి ఏడాది స్పెక్ట్రమ్‌ చెల్లింపుల కింద ప్రభుత్వానికి రూ.13,365 కోట్లు లభిస్తాయని కేంద్రం తెలిపింది. సాధ్యమైనంత వేగంగా 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జియో, ఎయిర్‌టెల్‌ ఆ రోజే ప్రకటించాయి.

నష్టాల్లో వొడాఫోన్​ ఐడియా: టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా త్రైమాసిక ఫలితాల్లో మరోమారు నష్టాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆ కంపెనీ రూ.7,297 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన నష్టం రూ.7319 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. గత త్రైమాసికంతో పోల్చినప్పుడు (రూ.6563 కోట్లు) మాత్రం నష్టాలు పెరిగాయి. కంపెనీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 13.8 శాతం పెరిగింది. రూ.9,144 కోట్ల నుంచి రూ.10,407 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. వొడాఫోన్‌, ఐడియా కంపెనీలు విలీనం అయిన తర్వాత రెవెన్యూ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.

కంపెనీ ఆర్పు సైతం (ఒక వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం) గతేడాదితో పోలిస్తే 23.4 శాతం పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆప్పు రూ.104 ఉండగా.. ఈ ఏడాది రూ.128కి చేరింది. టారిఫ్‌లు పెంచడం ఇందుకు దోహదపడింది. గత త్రైమాసికంలో 24.38 కోట్లుగా ఉన్న మొత్తం చందాదారుల సంఖ్య 24.04 కోట్లకు పడిపోయింది. అదే సమయంలో 4జీ చందాదారుల సంఖ్య 10 లక్షలు పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.0.3 క్షీణించి రూ.9.1 శాతం వద్ద ముగిసింది.

ఇవీ చదవండి:దుమ్మురేపిన రిలయన్స్​.. ఫార్చ్యూన్-500 లిస్ట్​లో ఒకేసారి 51 ర్యాంకులు జంప్

రికవరీ.. ఇష్టం వచ్చినట్లు కుదరదు.. ఆ సమయంలోనే సంప్రదించాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.