నిఫ్టీ 95+
వారంలో మొదటి రోజును భారీ లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సోమవారం సెషన్లో సెన్సెక్స్ 364 పాయింట్లు వృద్ధి చెంది 38,799 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్లు బలపడి 11,466 వద్దకు చేరింది.
ఆర్థిక షేర్ల జోరు, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణం.
ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎం&ఎం, టైటాన్, నెస్లే, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.