స్టాక్ మార్కెట్లు (Stocks Today) బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 476 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠమైన 58,723 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 139 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 17,519 వద్దకు చేరింది.
ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభాల జోరు మార్కెట్ల రికార్డుకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఆగస్టు నెలకు సంబంధించి ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం కూడా కలిసొచ్చినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 58,777 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం), 58,272 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,532 పాయింట్ల గరిష్ఠ స్థాయి(కొత్త రికార్డు), 17,386 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టైటాన్, హెచ్‌సీఎల్‌టెక్, ఎస్బీఐ భారీగా లాభాలను గడించాయి.
ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫినాన్స్, నెస్లే ఇండియా నష్టాలతో ముగిశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. కోస్పీ (దక్షిణ కొరియా) సూచీ లాభాలను గడించింది. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి: పాన్-ఆధార్ లింక్ చేయలేదా? రూ.10 వేలు ఫైన్ ఖాయం!