అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర 10 గ్రాములపై రూ.191 తగ్గి.. రూ.52,452 వద్ద స్థిరపడింది.
వెండి కూడా కిలోకు రూ.990 తగ్గి రూ.69,441కు చేరింది.
అంతర్జాతీయ పరిణామాల కారణంగా ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు తపన్ పటేల్ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గి ఔన్సుకు 1,943 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండి ధర ఔన్సుకు 26.78 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: ఆటుపోట్ల నడుమ ఫ్లాట్గా మార్కెట్ సూచీలు