ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా బడ్జెట్ 2020-21లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా ఆదాయపన్ను స్లాబ్లను 4 నుంచి 7కు పెంచింది.
నూతన స్లాబులు ఇవే..
⦁ 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు.
⦁ 2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం
⦁ రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పన్నులు యథాతథం
⦁ 5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం
⦁ 7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం
⦁ 10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం
⦁ 12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం
⦁ 15 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారికి 30 శాతం
కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు ఆర్థిక మంత్రి. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే మినహాయింపులు పొందేవారికి నూతన పన్ను రేట్లు వర్తించవని తెలిపారు.
ఈ కొత్త పన్ను రేట్లతో కేంద్రానికి రూ.40వేల కోట్లు ఆదాయం తగ్గనుందని చెప్పారు.