ETV Bharat / business

'ప్రభుత్వ ఉద్దీపనలతో సానుకూల ఫలితాలు' - కరోనా ప్యాకేజీతో ఉపయోగమెంట

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలు సానుకూల ఫలితాలిస్తాయని ఆర్​బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అభిప్రాయపడ్డారు. భారత్​తో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సరిపడా వనరులు ఉన్నాయని తెలిపారు.

jalan on govt measures
ఆర్థిక ప్యాకేజీపై బిమల్ జలాన్​ స్పందన
author img

By

Published : May 29, 2020, 10:43 AM IST

ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు సరైన దిశలో తీసుకున్న నిర్ణయాలుగా రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్​ అభిప్రాయపడ్డారు. వృద్ధి రేటు మరింతగా క్షీణించకుండా ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 1991తో పోలిస్తే ఇప్పుడు భారత్ పరిస్థితి పూర్తి భిన్నమని జలాన్ అన్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం భారత్​ వద్ద తగినన్ని వనరులు, విదేశీ మారకం నిల్వలు ఉన్నాయని అన్నారు.

"కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించినవి చాలా మంచి నిర్ణయాలు. అయితే డిమాండు కోణంలో కాకుండా సరఫరా కోణంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఆర్థిక వ్యవస్థపరంగా చూస్తే.. అధిక ద్రవ్యలోటు అధిక వృద్ధికి దారి తీస్తుందని ఎవరూ అనుకోరు." -బిమల్ జలాన్, ఆర్​బీఐ మాజీ గవర్నర్​

బ్రిటన్, అమెరికాల ఉద్దీపన ప్యాకేజీలతో పోలిస్తే భారత్​ ప్యాకేజీ తక్కువగా ఉందంటూ వస్తున్న విమర్శలపైనా జలాన్ స్పందించారు. అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తేడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలను తీసుకుంటే వృద్ధి రేటు 2 శాతం లేదా 3 శాతం వరకు ఉన్నా కూడా ఆ దేశాల తలసరి ఆదాయం ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల విషయానికొస్తే.. వృద్ధి రేటు 6 శాతం లేదా 7 శాతం ఉండాలని కోరుకుంటామన్నారు. అదే సమయంలో తలసరి ఆదాయం పెరిగేందుకు దవ్యోల్బణం నియంత్రణలో ఉండాలని కూడా కోరుకుంటామన్నారు.

ఇదీ చూడండి:పతంజలి బాండ్ల ఇష్యూ 3 నిమిషాల్లోనే పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.