ETV Bharat / business

2021 నాటికి పుంజుకుంటాం.. కానీ‌!

టీకా అందుబాటులోకి వస్తే.. ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థలు 2021 చివరి నాటికి సాధారణ స్థితికి చేరుకుంటాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయన్నది ఇంకా తెలియదని తెలిపారు బిల్​గేట్స్.

Economic growth is possible only with the vaccine
వ్యాక్సిన్​తోనే ఆర్థిక రికవరీ
author img

By

Published : Oct 7, 2020, 1:36 PM IST

కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 నుంచి కాపాడగలిగే సమర్థమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి.. దాని పంపిణీ సక్రమంగా జరిగితే ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థలు 2021 చివరి నాటికి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయన్నది ఇంకా తెలియదని తెలిపారు బిల్​గేట్స్. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని ఉత్పత్తి, పంపిణీ పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందన్నారు. అమెరికాలో ప్రజలు టీకాను తీసుకోవడానికి తొలుత సంకోచిస్తారని.. దాన్ని ఇప్పటి నుంచే అధిగమించాలని సూచించారు.

చైనా వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ..

ఇక రష్యా, చైనా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లపైనా బిల్‌ గేట్స్‌ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇప్పటి వరకు వారి టీకాలేవీ మూడో దశకు చేరుకున్నట్లు ప్రామాణిక ఆధారాలు లేవన్నారు. శాస్త్రీయంగా వారు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కచ్చితంగా ఆమోదయోగ్యమైనవేననన్నారు. కానీ, మూడో దశ ప్రయోగాలకు సంబంధించి పటిష్ఠమైన సమాచారం లేనందున బయటి దేశాలను ఆ టీకాలు అంతగా ఆకట్టుకోకపోవచ్చన్నారు. అయితే, పశ్చిమ దేశాలకు చెందిన కంపెనీలు రష్యా, చైనా వ్యాక్సిన్లపై మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వాటిలో ఈ టీకాలు సమర్థమైనవని తేలితే రష్యా, చైనా వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉండే అవకాశం ఉంటుందన్నారు.

కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభ సమయంలో దేశ ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా సమర్థంగా ముందుకు తీసుకెళ్లగలిగాయని గేట్స్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:ఈ సారి రెపో రేటుపై ఆర్​బీఐ నిర్ణయం అదేనా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.