ETV Bharat / business

'ఉద్యోగులకు ఊరట... ఈపీఎఫ్‌ భారం కేంద్రానిదే'

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. రూ.1.70 లక్షల కోట్లతో తీసుకువచ్చిన ఈ ప్యాకేజీలో వేతన జీవులకు ఊరటనిచ్చింది. రూ.15 వేల లోపు వేతనం ఉన్న వారికి.. ఉద్యోగి, యజమాని వాటా ఈపీఎఫ్‌ను మూడు నెలల వరకు కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేసింది.

govt good news to employee's
కరోనా ప్యాకేజీలో ఉద్యోగులకు ఊరట
author img

By

Published : Mar 26, 2020, 4:20 PM IST

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు భారీ ప్యాకేజీని ప్రకటించారు. 'ప్రధాన్ మంత్రి గరీబ్‌ కల్యాణ్ పథకం' పేరుతో రూ.1.70 లక్షల కోట్లతో తీసుకువచ్చిన ఈ ప్యాకేజీలో సంఘటిత, అసంఘటిత రంగాలకు పలు ఉద్దీపనలు ప్రకటించారు సీతారామన్.

ఈపీఎఫ్‌ భారం కేంద్రానిదే..

వచ్చే మూడు నెలల వరకు రూ.15 వేల లోపు వేతనం ఉన్న ఉద్యోగులపై.. ఈపీఎఫ్‌ భారం ( ఉద్యోగి, యజమాని ఇద్దరి వాటాలను(12+12)) కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. వంద లోపు ఉద్యోగులున్న సంస్థలకు ఇది వర్తిస్తుందని తెలిపారు.

ఈపీఎఫ్‌ నిబంధనల్లో మార్పులు..

ఉద్యోగులు ఈపీఎఫ్ నిధులు వాడుకునే విషయంలో పలు మార్పులు చేస్తున్నట్లు తెలిపారు నిర్మల. మూడు నెలల వేతనం, మొత్తం నిధుల్లో 75 శాతం.. ఏది తక్కువ ఉంటే అది వాడుకునేందుకు అనుమతివ్వనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 4.87 కోట్ల మందికి లబ్ధిచేకూరుతుందని చెప్పారు ఆర్థిక మంత్రి.

అసంఘటిత రంగాలకు..

నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి కింద రూ.31వేల కోట్ల ఖర్చు చేసుకునేందుకు, జిల్లా మినరల్ ఫండ్‌ను వైద్య పరీక్షల కోసం వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

ఆక్వా రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే పలు రాయితీలు ప్రకటించామని.. ఇందుకు సంబంధించి ప్రతి జిల్లా కలెక్టర్​తో స్వయంగా మాట్లాడతానని సీతారామన్ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:కరోనాపై పోరు: వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.