ETV Bharat / business

30 ఏళ్లు వచ్చేసరికి ఇవి చేయాల్సిందే! - ఇళ్లు కట్టుకోవడానికి ఆర్థిక ప్రణాళిక

ప్రణాళిక లేకుంటే.. ఏ విషయంలోనైనా పొరపాట్లు తప్పవు. ఆర్థికపరమైన అంశాల్లో ఇది మరీ ఎక్కువనే చెప్పాలి. అందుకే సంపాదించడం ప్రారంభించిన తొలినాళ్లలోనే సరైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్తే.. భవిష్యత్​లో వచ్చే ఇబ్బందులను తప్పించుకోవచ్చు. మరి ఆ ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

Financial plan for young
యువతకు ఆర్థిక ప్రణాళిక
author img

By

Published : Aug 4, 2021, 5:23 PM IST

వయసు పెరుగుతున్న కొద్దీ జీవన స్థితిగతులు మారుతుంటాయి. కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి. వీటికి అనుగుణంగా మన ఆర్థిక లక్ష్యాలూ మారుతుంటాయి. అయితే, మన పునాదులు బలంగా ఉంటే జీవనం సక్రమంగా సాగిపోతుంది. లేదంటే ఒడుదొడుకులు తప్పవు. ఈ నేపథ్యంలో మనం సంపాదించడం ప్రారంభించగానే సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. అందు కోసం 30 ఏళ్లు వచ్చే సరికి కొన్ని ఆర్థిక లక్ష్యాలను సాధించాలి. అవేంటో చూద్దాం..

కెరీర్‌పై పెట్టుబడి పెట్టండి..

సాధారణంగా 22 నుంచి 26 ఏళ్ల మధ్య మన వృత్తి జీవితం ప్రారంభమవుతుంది. అయితే, కొత్తగా ఉద్యోగం లేదా వ్యాపారంలోకి అడుగుపెట్టగానే మనకు తెలియని విషయాలను చాలా గుర్తిస్తుంటాం. వాటన్నింటినీ అవగాహన చేసుకోవాలి. అవసరమైతే వాటిలో నైపుణ్యం సాధించేందుకు కొత్త కోర్సులు చేయాలి. లేదా అనుభవజ్ఞుల సాంగత్యంలో మెళకువలు తెలుసుకోవాలి. అందుకోసం ముందు కెరీర్‌పై పెట్టుబడి పెట్టాలి. డబ్బు అవసరం లేని చోట సమయాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇది మున్ముందు మన కెరీర్‌కు బలమైన పునాదులు వేస్తుంది.

అత్యవసర నిధి..

సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడే మొత్తం అత్యవసర నిధి కోసం అందుబాటులో ఉండాలని నిపుణులు చెబుతుంటారు. కరోనా మహమ్మారి వంటి సమయంలో అది చాలా అవసరం. కుటుంబంలో మీరొక్కరే ఆర్జిస్తుంటే.. ఈ అత్యవసర నిధి కనీసం 12 నెలల ఖర్చులకు సరిపడా ఉండాలి. గత కొంతకాలంగా ఏదైనా పెద్ద ఖర్చులు వచ్చాయా, మరోసారి అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా లాంటివీ ఒకసారి ఆలోచించుకోండి. ఇలా అనుకోని ఖర్చులకూ ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందే.

రుణాలను ముగించేయండి..

చదువుకుంటున్న సమయంలో చేసిన చిన్న చిన్న రుణాలను ముగించేయాలి. విద్యా రుణం, క్రెడిట్‌ కార్డు లోన్‌, వ్యక్తిగత రుణం, ద్విచక్రవాహన రుణం.. ఇలా ఎలాంటి రుణాలు ఉన్నా 30 ఏళ్ల వయసు వచ్చే లోపు తీర్చేయాలి. లేదంటే వడ్డీ పెరిగి సమస్యలుగా మారతాయి. ఇవి మీ దీర్ఘకాల లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

తెలివిగా పెట్టుబడి పెట్టండి..

30 ఏళ్లు వచ్చే సరికి మీరు పూర్తిగా ఓ పెట్టుబడిదారుడిగా మారాల్సిన అవసరం వస్తుంది. దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా మీ సంపాదన, పొదుపు బట్టి ఎక్కడో ఒకచోట పెట్టుబడి పెట్టక తప్పదు. అప్పుడే మీ లక్ష్యాలను త్వరగా చేరుకోగలుగుతారు. కేవలం సంపాదన, పొదుపు ద్వారా మాత్రమే ఆర్థిక లక్ష్యాలను చేరాలంటే సాధ్యం కాకపోవచ్చు. అలాగే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మన సంపాదన పెరగాలంటే పెట్టుబడి పెట్టక తప్పుదు. అయితే, తెలివిగా పెట్టుబడి పెడితేనే ఉపయోగకరం. అందుకు సరైప పథకాల్ని ఎంచుకోవాలి. లేదా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టాలంటే ఆ రంగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్లు, ఇన్సూరెన్స్‌, ఈక్విటీ.. ఇలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా ఆర్థిక అంశాలపై కొంత మేర అవగాహన ఉండాలి. లేదంటే నిపుణుల సలహాలు తీసుకోవడం ఉచితం.

మంచి క్రెడిట్‌ స్కోర్‌..

ఎంత చక్కగా ప్లాన్‌ చేసుకున్నా.. జీవితంలో కొన్ని ఆటుపోట్లు తప్పవు. వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగితేనే.. మన జీవితం పరిపూర్ణమవుతుంది. మరి హఠాత్తుగా వచ్చే కొన్ని అవసరాలకు డబ్బు సర్దుబాటు కాకపోవచ్చు. అలాంటప్పుడు రుణం తీసుకోక తప్పదు. మరి మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉంటేనే రుణ మంజూరుకు అవకాశాలు ఎక్కువ. 30 ఏళ్లు వచ్చే సరికి అప్పులన్నీ తీర్చేసి.. సకాలంలో బిల్లులు చెల్లిస్తే మంచి క్రెడిట్‌ స్కోర్‌ మెయింటైన్ చేయొచ్చు.

ఆరోగ్య, జీవిత బీమా..

మీకు 30 ఏళ్లు వచ్చే సరికి మీపై ఆధారపడే వాళ్లు ఉంటారు. జీవిత భాగస్వామి, పిల్లలు, అమ్మానాన్నలు.. ఇలా వారికి సురక్షితమైన జీవితాన్ని అందించేందుకు ముందు మీకు మీరు రక్షణ కల్పించుకోవాలి. అందుకోసం ఆరోగ్య బీమా, జీవిత బీమా తీసుకోవాలి. ఇంట్లో వాళ్లకు కూడా సరైన బీమా పాలసీలు చేయించాలి. ఎంత తక్కువ వయసులో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది ఒక రకంగా పొదుపు చేయడమే.

ఇంటి కోసం..

సాధారణంగా ఒక ఇంటి జీవితకాలం 40-60 ఏళ్లు. మరి ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు ఏదో ఒక రోజు నేలమట్టం అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఇళ్లు కట్టాల్సి వస్తుంది. అందుకోసం సరైన ప్రణాళిక వేసుకోవాలి. ఇంటి స్థలం, ఇప్పుడు ఉంటున్న ఇంటి పరిస్థితి.. ఎంత ఖర్చయ్యే అవకాశం ఉంది.. వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని కొత్త ఇంటి నిర్మాణం కోసం చిన్న వయసులోనే ప్రణాళికలు వేసుకోవాలి.

రిటైర్‌మెంట్‌..

రిటైర్‌మెంట్‌ జీవితం సాఫీగా సాగాలంటే.. ఆదిలోనే దానికి పునాదులు వేయాలి. అందుకోసం సరైన పథకాలను ఎంచుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్లు, ఎన్‌పీఎస్‌, ప్రావిడెంట్‌ ఫండ్లు.. ఇలాంటి అనేక మార్గాలున్నాయి. వీటిలో క్రమం తప్పకుండా మదుపు చేయాలి. రిటైర్‌మెంట్‌ వయసుకు వచ్చే సరికి ఆర్థిక అవసరాల కోసం మరొకరిపై ఆధారపడకుండా చూసుకోవాలి.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.