ETV Bharat / business

భారత్​లో ఎంఐ 108 ఎంపీ కెమెరా ఫోన్- ధర తెలుసా? - ఎంఐ 10 స్మార్ట్​ఫోన్ ఫీచర్లు

స్మార్ట్​ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 108 మెగా పిక్సెల్​ కెమెరా స్మార్ట్​ఫోన్​ను ఎట్టకేలకు భారత మార్కెట్లోకి విడుదల చేసింది షియోమీ. 5జీ సాంకేతికతతో ఎంఐ 10పేరుతో ఈ మోడల్​ను ఆవిష్కరించింది. వీటితో పాటు ఇయర్​బడ్స్​2, ఎంఐ బాక్స్​నూ విడుదల చేసింది. వీటి ఫీచర్లు, ధరలు, కొనుగోళ్లకు ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయి అనే వివరాలు మీ కోసం.

mi new smartphone
ఎంఐ కొత్త స్మార్ట్​ఫోన్​
author img

By

Published : May 8, 2020, 1:29 PM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమీ.. ఎంఐ 10 పేరుతో నేడు సరికొత్త 5జీ స్మార్ట్​ఫోన్​ను భారత్​లో విడుదల చేసింది. లాక్​డౌన్​ నేపథ్యంలో ఆన్​లైన్​ ఈవెంట్​లో ఈ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది షియోమీ. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ సామర్థ్యంతో రెండు వేరియంట్​లలో ఈ స్మార్ట్​ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.49,999, రూ.54,999గా నిర్ణయించింది షియోమీ.

ఎంఐ 10 ఫీచర్లు..

  • 6.94 సెంటీమీటర్ల, 3డీ, కర్వ్, ఆమోలోడ్ డిస్​ప్లే
  • క్వాల్కమ్​ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌
  • వెనుకవైపు నాలుగు కెమెరాలు [(108 ఎంపీ ప్రధాన కెమెరా) 2ఎంపీ+2ఎంపీ+13ఎంపీ]
  • 20 ఎంపీ పంచ్​హోల్​ సెల్ఫీ కెమెరా
  • 4,780 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 30 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జర్​ సపోర్ట్‌ (65 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఛార్జ్)
  • రివర్స్​ వైర్​లెస్​ ఛార్జింగ్ సదుపాయం

నేటి (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రీ ఆర్డర్​కు అవకాశం కల్పించింది షియోమీ. ప్రీ ఆర్డర్​ ద్వారా ఈ మోడల్​ను బుక్ చేసుకున్న వారికి రూ.2,499 విలువైన ఎంఐ వైర్​లెస్ పవర్​బ్యాంక్​ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎంఐడాట్​కామ్, అమెజాన్​లో ప్రీ ఆర్డర్​లు స్వీకరించనున్నట్లు తెలిపింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డ్​ల ద్వారా లావాదేవీలు జరిపే వారికి అదనంగా రూ.3,000 వరకు క్యాష్​ బ్యాక్ అఫర్ లభిస్తుంది.

ఇయర్ బడ్స్.

ఎంఐ స్మార్ట్​ఫోన్​తోపాటే.. ఎంఐ వైర్​లెస్​ ఇయర్​ఫోన్స్​2 కుడా విడదల చేసింది ఎంఐ. ఏకధాటిగా 4 గంటల పాటు బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకత. ఇయర్​ఫోన్స్​ బాక్స్​లో ఉండే ఛార్జింగ్ సదుపాయంతో 14 గంటల వరకు బ్యాటరీ సామర్థ్యం పని చేయనున్నట్లు షియోమీ వెల్లడించింది.

wireless earphones
వైర్​లెస్ ఇయర్​ఫోన్స్​2
  • ఇయర్​ బడ్స్2 మే 12 నుంచి 17 మధ్య రూ.3,999 ప్రత్యేక ధరకు విక్రయించనున్నట్లు తెలిపింది.
  • మే 12 నుంచి ఎంఐడాట్​కామ్, అమెజాన్.ఇన్​, ఎంఐ హోంలో కొనుగోలు చేయొచ్చు.

ఎంఐ బాక్స్..

సాధారణ ఎల్​ఈడీ టీవీను స్మార్ట్​ టీవీగా వాడుకునే వీలువగా ఉపయోగపడే సరికొత్త ఎంఐ బాక్స్​నూ విడుదల చేసింది షియోమీ. 4కే అనుభూతితో అన్ని రకాల ఓటీటీ సేవలను ఎంఐ బాక్స్ ​ద్వారా పొందొచ్చని వెల్లడించింది.

mi box
ఎంఐ బాక్స్​
  • ఎంఐ బాక్స్ ధరను రూ.3,499గా నిర్ణయించింది షియోమీ.
  • మే 10 మధ్యాహ్నం 12 నుంచి.. ఫ్లిప్​కార్ట్​, ఎంఐడాట్​కామ్, ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియోల్లో కొనుగోలు చేయొచ్చు.

ఇదీ చూడండి:ఆ సంస్థ ఉద్యోగులకు షాక్- మే నుంచి వేతనాల్లో కోత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.