ETV Bharat / business

జర్మనీ జీడీపీని దాటిన చైనా కుబేరుల సంపద - కరోనా కాలంలోనూ పెరిగిన చైనా కుబేరుల సంబద

చైనా కుబేరుల సంపద కరోనా వైరస్​ సంక్షోభంలోనూ భారీగా పెరిగింది. ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్​మా సంపద గత ఏడాదితో పోలిస్తే.. 45 శాతం పెరిగి 58.8 బిలియన్ డాలర్లకు చేరిందని ఓ నివేదిక వెల్లడించింది. దీనితో ఈయనే మరోసారి చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచినట్లు పేర్కొంది. చైనా సంపన్నుల మొత్తం సంపద 4 ట్రిలియన్ డాలర్ల మార్క్​ను దాటినట్లు నివేదిక వివరించింది.

Hugely grown jack ma Wealth
భారీగా పెరిగిన జామ్ మా సంపద
author img

By

Published : Oct 21, 2020, 11:34 AM IST

కరోనా వైరస్​ సంక్షోభంలోనూ చైనా కుబేరుల సంపద భారీగా పెరిగింది. 'హరూన్​ చైనా రిచ్​ లిస్ట్ 2020' తాజా నివేదిక ప్రకారం.. చైనాలో ఈ ఏడాది కొత్తగా 257 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. దీనితో మొత్తం చైనా బిలియనీర్ల సంఖ్య 878కి పెరిగింది. 1999కి ముందు వరకు చైనాలో ఒక్క బిలియనీర్​ కూడా లేరని విషయాన్ని సర్వే గుర్తు చేసింది.

చైనాలో మొత్తం 2,398 మంది వ్యక్తిగత సంపద 290 మిలియన్​ డాలర్లకన్నా ఎక్కువగా ఉంది. వీరందరి పూర్తి సంపద 4 ట్రిలియన్ డాలర్లని నివేదిక తెలిపింది. ఈ మొత్తం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి కన్నా ఎక్కువని వివరించింది.

సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు..

  • ఆన్​లైన్ షాపింగ్, ఇతర సేవలకు పెరిగిన గిరాకీతో ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థపాపడుకు జాక్​మా సంపద 2019తో పోలిస్తే..45 శాతం వృద్ధి చెంది 58.8 బిలియన్​ డాలర్లకు చేరింది. దీనితో చైనాలో అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానాన్ని కొనసాగించారు.
  • వీ చాట్ మెసేజింగ్ సర్వీస్ నిర్వహించే టెన్సెంట్ వ్యవస్థాపకుడు మా హుటెంగ్ 57.4 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరిగింది.
  • బాటిల్డ్​ వాటర్ బ్రాండ్ నాంగ్​ఫూ స్ప్రింగ్ ఛైర్మన్ జాంగ్ షాన్​సన్​ 53.7 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. సెప్టెంబర్​లో జాంగ్ కంపెనీ హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో నమోదు కావడం వల్ల ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.
  • స్థిరాస్తి సంస్థ కంట్రీ గార్డెన్ అధినేత్రి యాంగ్​ హ్యుయాన్​ అత్యంత సంపన్న మహిళగా ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఈమె సంపద గత ఏడాదితో పోలిస్తే 29 శాతం పెరిగి.. 33 బిలియన్ డాలర్లకు చేరింది.
  • ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ 'జూమ్​' వ్యవస్థాపకుడు ఎరిక్​ యువాన్ సంపద 10 బిలియన్ డాలర్లు పెరిగి.. మొత్తం ఆస్తి 16.2 బిలియన్​ డాలర్లకు చేరింది.
  • ఆఫ్​సిన్ అధిపతి లీ యాంగ్సిన్ సంపద రెట్టింపై 20.6 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఇదీ చూడండి:గూగుల్ సంస్థ​పై అమెరికా న్యాయశాఖ దావా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.