ETV Bharat / business

'కరోనాతో సవాళ్లే కాదు అవకాశాలూ పెరిగాయ్' - కంపెనీలపై కరోనా ప్రభావం

కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు తమకు అనేక సవాళ్లతో పాటు.. కొత్త కొత్త అవకాశాలను కూడా కల్పించినట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. వీటన్నింటినీ తట్టుకుని భవిష్యత్​లో మరింత బలంగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు చంద్రశేఖరన్​.

chandrasekaran  tata chairman
చంద్రశేఖరన్ టాటా గ్రూప్ ఛైర్మన్
author img

By

Published : Jul 7, 2020, 1:29 PM IST

కొవిడ్‌-19 కారణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టాటాగ్రూప్‌ కూడా మారుతుందని సంస్థ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.

ఫిబ్రవరిలో టాటా కెమికల్స్‌ టాటాగ్లోబల్‌ బేవరేజస్‌లో విలీలమైన తర్వాత నిర్వహించిన తొలి వార్షిక సమావేశం ఇది కావడం విశేషం.

లాక్​డౌన్​ దేశీయ మార్కెట్లలో రవాణా విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు చంద్రశేఖరన్​. భారీగా కార్మికులు వలసపోవడం, ప్రయాణాలు, రవాణాపై నియమ నిబంధనలు అమల్లో ఉండటం, రీటైల్‌ కార్యకలాపాలను గాడినపెట్టడం వంటి అంశాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు.

"అయితే ప్రస్తుత పరిస్థితులు సవాళ్లతో పాటు అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. మా బేవరేజస్‌ , ఆహార వ్యాపారాల విలీనంతో మాకు ఎదిగేందుకు బలమైన వేదిక లభించినట్లయింది. ప్రస్తుత పరిస్థితి మాకు చాలా నేర్చుకొనే అవకాశం కల్పిస్తోంది. మేము భవిష్యత్తులో ఈ పరిస్థితుల నుంచి బలంగా ఎదుగుతాము."

- ఎన్​ చంద్రశేఖరన్​, టాటా గ్రూప్ ఛైర్మన్​

టాటాస్టార్‌బక్స్‌ 2019-2020 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 21 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోయింది. కానీ, నాలుగో త్రైమాసికంలో కరోనావైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రభావితమైందని వాటాదారులతో ఆయన చెప్పారు. స్వల్పకాలానికి స్టోర్లను తెరవడం.. వ్యాపారాన్ని పునర్‌ ప్రారంభించడానికి ఎంత వేగంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే అంశం కీలకమైందని తెలిపారు. తా డెలివరీ, ఓపెన్‌ పికప్‌ మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆర్డరిస్తే ఇంటికే మాంసం డెలివరీ.. ఈ-స్టార్టప్‌లకు పెరిగిన గిరాకీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.