ETV Bharat / business

టాటా నుంచి వైదొలగనున్న పల్లోంజీ..!

టాటాలు.. మిస్త్రీల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశముంది. ఇటీవల టాటా గ్రూపులోని తమ వాటాలను విక్రయించి వైదొలుగుతామని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్​ పేర్కొంది. పల్లోంజీ గ్రూప్​ విక్రయించే షేర్లను టాటాలు కొనుగోలు చేస్తే దానికి ఎంత ధర చెల్లించాలనే విషయం కీలకంగా మారనుంది.

Pallonji to quit Tata
టాటా నుంచి వైదొలగనున్న పల్లోంజీ..!
author img

By

Published : Sep 25, 2020, 8:00 PM IST

టాటా-సైరస్‌ మిస్త్రీ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల టాటా గ్రూప్‌లోని తమ వాటాలను విక్రయించి వైదొలుగుతామని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ పేర్కొంది. ఈ కంపెనీకి టాటాలో 18.4శాతం వాటా ఉంది. దీనిలోని వాటాలను విక్రయించి తమ ఎస్‌పీ గ్రూపులో పెట్టాలని నిశ్చయించుకుంది. గతంలో ఈ వాటాలను తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనుకున్నారు. కానీ, టాటా తాము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు వెల్లడించడంతో ఎస్‌పీ గ్రూప్‌ నిర్ణయాన్ని న్యాయస్థానం నిలిపివేసింది. ఇక్కడ మరోసారి టాటాలు.. మిస్త్రీల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

విలువ నిర్ణయించడమే కీలకం..

పల్లోంజీ గ్రూప్‌ విక్రయించే షేర్లను టాటాలు కొనుగోలు చేస్తే దానికి ఎంత ధర చెల్లించాలనే విషయం కీలకంగా మారనుంది. ఇరు వర్గాలు మంచి ధర రావాలని కోరుకుంటున్నాయి. కోర్టుకు చేసిన ఫైలింగ్‌ ప్రకారం పల్లోంజీ గ్రూప్‌ వాటాల విలువ 20.3 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చు. ఈ డీల్‌లో ఎవరు బలంగా వ్యవహరిస్తారనే అంశంపైనే ధర ఆధారపడే అవకాశం ఉంది. మరోపక్క పల్లోంజీ గ్రూపు చెల్లించాల్సిన రుణాల ఒత్తిడి కూడా ఉండటంతో వీలైనంత తొందరగా డీల్‌ కుదుర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు వ్యాపారాలు ఇంకా పుంజుకోని సమయంలో టాటాలు ఈ షేర్లను కొనుగోలు చేయడమనేది భారమే.

మార్పులు చేసిన 'ఆర్టికల్‌ ఆఫ్‌ అసోసియేషన్‌' నిబంధనల ప్రకారం వాటాదారులు తమ షేర్లను మరో ఇన్వెస్టర్‌కు విక్రయించే ముందు టాటాలకు అవకాశం ఇవ్వాలని ఈ డీల్‌కు సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి ఆంగ్లపత్రికకు వెల్లడించారు. దీనిపై ఇరువర్గాలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

2012లో రతన్‌ టాటా వైదొలగాక సైరస్‌ మిస్త్రీ టాటాసన్స్‌ బాధ్యతలను చేపట్టారు. కానీ కొన్ని విభేదాల కారణంగా 2016లో ఆయన్ను ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.