ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న డార్క్‌మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. భారత్‌లోని 40 కోట్ల వినియోగదారులకు ముదురు, లేత బూడిద రంగుల్లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది మెస్సేజింగ్ దిగ్గజం.
ఎన్నో పరిశోధనల తర్వాత ఈ రెండు రంగులను ఎంపిక చేసినట్లు వాట్సాప్ తెలిపింది. చదివేందుకు, విషయం సరిగ్గా కనిపించే విధంగా ఉండేందుకు ఈ రంగులను ఖరారు చేసినట్లు తెలిపింది.
తాజా అప్డేట్ అవసరం..
ఈ కొత్త ఫీచర్‌ను పొందాలంటే వాట్సాప్ తాజా అప్డేట్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 వినియోగదారులు సిస్టమ్ సెట్టింగ్స్‌లో డార్క్‌మోడ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆండ్రాయిడ్ 9, దానికింది ఆపరేటింగ్ సిస్టమ్స్ వినియోగదారులైతే వాట్సాప్ సెట్టింగ్స్‌లోని చాట్స్ >> థీమ్ >> డార్క్ మోడ్‌ను ఎంపిక చేసుకోవాలి.
ప్రపంచంలో అత్యంత ప్రియమైన మెసేజింగ్ వేదికల్లో ఒకటైన వాట్సాప్ ఇటీవలే 2 బిలియన్ యాక్టివ్ యూజర్లను దాటింది. ఫేస్బుక్ యాజమాన్యంలోని ఈ అనువర్తనం సరికొత్త నవీకరణలు, గోప్యతా ప్రమాణాలతో వినియోగదారులకు అద్భుతమైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తోంది.