భారత్‌లో నిషేధం ఎదుర్కొంటున్న టిక్‌టాక్ వ్యాపారాలను విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు టిక్‌టాక్ ఇండియాను విక్రయించేందుకు బైట్‌డ్యాన్స్ ఆసక్తి చూపుతున్నట్లు టెక్ క్రంచ్ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ఇరు సంస్థలు జులై చివరి వారం నుంచే చర్చలు ప్రారంభించినట్లు నివేదిక తెలిపింది. అయితే ఇంకా ఈ ఒప్పందం గురించి ఇరు సంస్థలు తుది నిర్ణయానికి రాలేదని పేర్కొంది.
మైక్రోసాఫ్ట్-టిక్ టాక్ డీల్ కష్టమే?
మరోవైపు టిక్‌టాక్ అమెరికా సహా అంతర్జాతీయ వ్యాపారాల కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే టిక్‌టాక్‌ను తక్కువ విలువకే దక్కించుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోందని.. ఇందుకోసం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు లేవని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్- రిలయన్స్ ఒప్పందంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
టిక్‌టాక్ కొనుగోలు కోసం.. మరో టెక్ దిగ్గజం ట్విట్టర్ కూడా ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
టిక్‌టాక్ నిషేధం ఎందుకు?
దేశీయ వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు ఉన్న కారణంతో టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది.
బ్యాన్ అయ్యే సమయానికి టిక్‌టాక్‌కు దేశంలో మొత్తం 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అదే సమయానికి టిక్‌టాక్‌కు 3 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్నట్లు అంచనా.
ఇదీ చూడండి:నాలుగేళ్ల తర్వాత ఫోన్ల మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్