ఆసియా మార్కెట్ల సానుకూలత..
స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 199 పాయింట్లు బలపడి 31,643 వద్దకు చేరింది. నిఫ్టీ 52 పాయింట్లు పుంజుకుని 9,251 వద్ద స్థిరపడింది.
కరోనా ప్యాకేజీపై ఆశలకు తోడు.. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ లాభాలను గడించిన నేపథ్యంలో మన మార్కెట్లు సానుకూలంగా ముగిశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హెచ్‌యూఎల్, నెస్లే, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, రిలయన్స్, కోటక్ బ్యాంక్ షేర్లు భారీగా పుంజుకున్నాయి.
ఎన్టీపీసీ, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాలతో ముగిశాయి.