ETV Bharat / business

ఆటో, బ్యాంకింగ్ జోరు- నష్టాలకు బ్రేక్ - షేర్ మార్కెట్లు లేటెస్ట్

స్టాక్ మార్కెట్ల రెండు రోజుల నష్టాలకు నేడు బ్రేక్ పడింది. వాహన, బ్యాంకింగ్ షేర్ల దన్నుతో నేడు లాభాలతో ముగిశాయి సూచీలు. సెన్సెక్స్ 232 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 65 పాయింట్లు వృద్ధి చెందింది.

stocks closed in profits
స్టాక్ మార్కెట్ల లాభాలు
author img

By

Published : May 6, 2020, 3:57 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 232 పాయింట్లు బలపడి 31,686 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 9,271 వద్దకు చేరింది.

ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి ఎదురైనా.. హెవీ వెయిట్ షేర్ల దన్నుతో లాభాలు ఆర్జించాయి సూచీలు. వాహన, బ్యాంకింగ్, టెలికాం రంగ షేర్లు నేటి లాభాలకు కారణమయ్యాయి. ఐటీ రంగ షేర్ల నేడు నిరాశ పరిచాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 31,971 పాయింట్ల అత్యధిక స్థాయి, 31,159 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,347 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,116 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్​, హీరో మోటోకార్ప్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

ఐటీసీ, హెచ్​యూఎల్, టీసీఎస్​, టైటాన్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి నేడు 9 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.72కిచేరింది.

ఇదీ చూడండి:రాష్ట్రాల ఆదాయంలో మద్యం వాటా ఎంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.