ETV Bharat / business

రాష్ట్రాల ఆదాయంలో మద్యం వాటా ఎంత?

'మాస్కు ధరించడం తప్పనిసరి.. భౌతిక దూరం పాటించి తీరాల్సిందే.. నలుగురుకన్నా ఎక్కువ మంది గుమిగూడడం నిషేధం"... లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి వినిపిస్తున్న మాటలివి. కరోనా కట్టడికి ఇవి అత్యవసరం కూడా. కానీ... మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాక ఇవేవీ వినిపించడంలేదు, కనిపించడంలేదు. ఎందుకిలా? ప్రమాదమని తెలిసినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపడానికి కారణమేంటి?

revenue to the govt from liquo
రాష్ట్రాల ఆదాయంలో మద్యం వాటా
author img

By

Published : May 6, 2020, 2:50 PM IST

crowd at wines
మద్యం కోసం భౌతిక దూరం నిబంధనలకు తూట్లు

ఈ ఫొటో చూశారా? ఇక్కడ అందరి లక్ష్యం ఒక్కటే... 40 రోజుల దాహం తీర్చుకోవడం. ఎవరికీ కరోనా భయం లేదు. మాస్కులు సక్రమంగా ధరించి, జాగ్రత్తపడదామన్న ఆలోచన లేదు. భౌతిక దూరం పాటించే ఉద్దేశం అసలే లేదు. ఒకరిపై ఒకరు పడుతూ.. తోసుకుంటూ... 'నిషా'ను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. లాక్​డౌన్ 1.0, 2.0లో రోడ్లపైకి అనవసరంగా వచ్చిన వారికి వినూత్న శిక్షలు విధించిన పోలీసులు... ఇప్పుడు మాత్రం మిన్నకుండిపోయారు.

కరోనా భూతంతో ఇలా చెలగాటం ఆడడం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎందుకిలా? 40 రోజుల లాక్​డౌన్​ను అత్యంత పకడ్బందీగా అమలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... 3వ దశలో మాత్రం ఎందుకు ఇంత సాహసం చేశాయి? సమాధానం ఒక్కటే... మద్యం నుంచి భారీగా వచ్చే ఆదాయం.

"లాక్​డౌన్​ అమలుతో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే వస్తుంది. ఇది ప్రభుత్వానికి కాస్త ఊరటనిచ్చే అంశం."

-డీఎన్​ రైనా, ఆల్​ ఇండియా డిస్టిలరీస్ అసోసియేషన్ డైరెక్టర్​ జనరల్

కేంద్రం కూడా మద్యం వ్యాపారాల నుంచి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తుందని లెక్కగట్టింది. బిహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మినహా దేశంలోని 16 పెద్ద రాష్ట్రాల నుంచి 2020-21లో రూ.1.65 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్​లో అంచనా వేసింది మోదీ సర్కార్. ఈ లెక్కలు చూస్తే మద్యం ద్వారా వచ్చే ఆదాయానికి ఉన్న ప్రాధాన్యం ఏంటో అర్థమవుతోంది.

రాష్ట్రాల ఆదాయాలు ఇలా..

  • తెలంగాణ, బంగాల్, ఛత్తీస్​గఢ్​, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 15 నుంచి 20 శాతం మద్యం వ్యాపారాల ద్వారానే వస్తోంది.
  • కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇది 10 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మద్యంతో అత్యధిక ఆదాయం పొందిన రాష్ట్రాలు..

రాష్ట్రంఆదాయం (2019-20లో)
తెలంగాణరూ.21,500 కోట్లు
ఉత్తర్​ప్రదేశ్రూ.26,000 కోట్లు
మహారాష్ట్ర రూ.24,000 కోట్లు
కర్ణాటక రూ.20,000 కోట్లు
బంగాల్రూ.11,874 కోట్లు
రాజస్థాన్​రూ.7,800 కోట్లు
పంజాబ్ రూ.5,000 కోట్లు

ఇదీ చూడండి:పెట్రో సుంకం పెంపుతో కేంద్రానికి ఇంత లాభమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.