ETV Bharat / business

చివరి గంటలో కొనుగోళ్ల జోరు- సెన్సెక్స్ 519+ - స్టాక్ మార్కెట్లు లేటెస్ట్

చివరి గంటలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 519 పాయింట్లు బలపడింది. నిప్టీ 160 పాయింట్లు పుంజుకుంది. అయితే ఇటీవల వరుస లాభాలతో దూసుకుపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ సెషన్​లో డీలా పడ్డాయి.

stocks ended in profits
లాభాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Jun 23, 2020, 3:49 PM IST

Updated : Jun 23, 2020, 4:20 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బొంబయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 519 పాయింట్లు పుంజుకుని 35,430 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 160 పాయింట్ల వృద్ధితో 10,471 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు లాభాలకు బాసటగా నిలిచాయి. భారత్​-చైనా సరహద్దుల్లో నెలకొన్న వివాదానికి తెరదించేందుకు చర్చలు జరగ్గా.. బలగాల ఉపసంహణకు ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 35,482 పాయింట్ల అత్యధిక స్థాయి, 34,844 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,477 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,302 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎల్​&టీ 6.68 శాతం, బజాజ్ ఫినాన్స్ 6.54 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.29 శాతం, ఎన్​టీపీసీ 5.83 శాతం, పవర్​ గ్రిడ్ 5.06 శాతం లాభపడ్డాయి.

రిలయన్స్ అత్యధికంగా 1.55 శాతం నష్టపోయింది. భారతీ ఎయిర్​టెల్ 0.36 శాతం, మారుతీ 0.20 శాతం నష్టాన్ని మూటగట్టుకున్నాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ మూడు కంపెనీలు మాత్రమే నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్లో రూపాయి గురువారం 37 పైసలు పుంజుకుంది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.66 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:కరోనాతో భారత్​లో బెర్లిన్ యుద్ధం నాటి స్థితి!

Last Updated : Jun 23, 2020, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.