ETV Bharat / business

మరో బ్యాంకు కుంభకోణం- నిందితులు విదేశాలకు జంప్

author img

By

Published : May 9, 2020, 2:02 PM IST

బ్యాంకులకు రుణాలు ఎగొట్టి విదేశాలకు పరారైన మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎస్​బీఐ సహా ఆరు బ్యాంకులకు రూ.411 కోట్లు టోకరా వేసి.. ఓ సంస్థ ప్రమోటర్లు విదేశాలకు పరారయ్యారు. ఈ విషయంపై ఎస్​బీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది సీబీఐ.

bank fraud
మరో బ్యాంక్ కుంభకోణం

విజయ్​ మాల్యా, నీరవ్ మోదీ వ్యవహారం మదిరిగానే.. మరో ఆర్థిక కుంభకోణం బయట పడింది. బాస్మతీ బియ్యం ఎగుమతి చేసే రామ్​ దేవ్ ఇంటర్నేషనల్​ సంస్థ ప్రమోటర్లు ఆరు బ్యాంకులకు రూ.411 కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైనట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేసింది ఎస్​బీఐ.

రామ్​దేవ్ ఇంటర్నేషనల్ సంస్థ తీసుకున్న రుణాలను 2016 జనవరి 27 నుంచి నిరర్ధక ఆస్తులుగా పరిగణిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది ఎస్​బీఐ. ఈ విషయమై ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఫిర్యాదు చేయగా.. ఏప్రిల్ 28న కేసు నమోదు చేసింది సీబీఐ.

రాందేవ్ ఇంటర్నేషనల్​ సంస్థ డైరెక్టర్లు నరేశ్ కుమార్, సురేశ్​ కుమార్, సంగీతలపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. దేశవ్యాప్త లాక్​డౌన్ కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి తనిఖీలు చేయడం లేదని వెల్లడించింది. ఈ కేసులో నిందితులకు తొలుత సమన్లు జారీ చేస్తామని.. స్పందించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇవే..

ఎస్​బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్​ బ్యాంక్, ఐడీబీఐ, సెంట్రల్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్​ రామ్​ దేవ్ ఇంటర్నేషనల్ సంస్థకు ఈ మొత్తం రుణాలు ఇచ్చాయి.

ఇదీ చూడండి:ఎన్​ఆర్​ఐలకు శుభవార్త- ఆ కాలాన్ని లెక్కించరట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.