లాక్డౌన్ వల్ల భారత్లో అనేకమంది ఎన్ఆర్ఐలు చిక్కుకుపోయారు. తాజాగా వీరికి కేంద్రం ఉపశమనం కలిగించింది. లాక్డౌన్ వల్ల వీరు దేశంలో ఉన్న కాలాన్ని పరిగణించమని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 6 మేరకు ఈ సౌలభ్యం కలిపిస్తున్నట్టు పేర్కొంది.
దేశంలో చిక్కుకుపోవడం వల్ల పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుందని ఎన్ఆర్ఐలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈమేరకు స్పష్టతనిచ్చింది సీబీడీటీ(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు)
విమాన సేవల పునరుద్ధరణ జరిగిన అనంతరం.. గడువు పెంపును మినహాయించి వీరి నివాస కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
గత సంవత్సం(2019-2020)లో అనేక మంది భారత్కు వచ్చారు. తమ ఎన్ఆర్ఐ గుర్తింపుపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండటానికి.. గత ఆర్థిక సంవత్సరంలోనే వెనక్కి వెళ్లిపోవాలని భావించారు. కానీ లాక్డౌన్ కారణంగా వారిలోని చాలా మంది దేశంలో చిక్కుకుపోయారు.
సంవత్సర కాలంలో ఓ వ్యక్తి ఎన్ని రోజుల పాటు దేశంలో ఉన్నాడనే దానిపై అతడు భారత దేశస్థుడా? లేక ఎన్ఆర్ఐనా? అన్న విషయం ఆధారపడి ఉంటుంది.
ఇదీ చూడండి:- 'వర్క్ ఫ్రం హోమ్' చేసే వారికి జియో గుడ్ న్యూస్!