రెన్యూ పవర్ భారత్‌లో భారీ హైబ్రిడ్ విద్యుత్తు ప్లాంటు నెలకొల్పేందుకు సిద్ధమైంది. 1.3 గిగావాట్స్ సామర్థ్యం గల ప్రాజెక్టును చేపట్టనుంది. దీని కోసం 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ 24 గంటలు విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. భారత్‌లో ఈ తరహా ప్రాజెక్టు చేపట్టడం ఇదే తొలిసారి. కేంద్ర సౌర విద్యుత్తు కార్పొరేషన్ నుంచి గత మే నెలలో ఈ ప్రాజెక్టును రెన్యూ పవర్ టెండర్ ప్రక్రియలో దక్కించుకుంది.
కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్.. మొత్తం మూడు ప్రాంతాల్లో రెన్యూ పవర్ ప్లాంట్లు నెలకొల్పనుంది. మొత్తం 1.3 గిగావాట్స్ విద్యుత్తులో 0.9 గిగావాట్లు పవన విద్యుత్తు కాగా.. మిగిలిన 0.4 గిగావాట్లు సౌర విద్యుత్తు. సౌర విద్యుత్తుకు బ్యాటరీ స్టోరేజీని కూడా జత చేయనున్నారు. ఏటా 80 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో ఇది పనిచేయనున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును తూర్పు, ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : ప్రపంచ కుబేరుడు చెప్పిన 3 విజయ సూత్రాలు!