ETV Bharat / business

రెపో రేటు, ఆర్థిక గణాంకాలే మార్కెట్లకు కీలకం! - సెన్సెక్స్

రెపో రేటుపై ఆర్​బీఐ నిర్ణయం, జులై నెల ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయాల లెక్కలు సహా అనేక అంశాలు ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. దిగ్గజ సంస్థలు ఎయిర్​టెల్, టాటా స్టీల్​ ఈ వారమే క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు కరోనా కేసులు, అమెరికా-చైనా మధ్య సంబంధాలు మార్కెట్లకు ఈ వారం కీలకంగా మారనున్నాయి.

stocks this week
ఈ వారం స్టాక్ మార్కెట్ అంచనాలు
author img

By

Published : Aug 2, 2020, 4:46 PM IST

స్టాక్ మార్కెట్లను ఈ వారం దేశీయంగా చాలా అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, జులైకు సంబంధించి స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల ఫలితాలు, కరోనా కేసుల వంటివి ఇందులో ప్రధానంగా ఉండనున్నాయి.

రెపో రేటుపై దృష్టి..

కరోనా కారణంగా కీలక వడ్డీ రేట్లను ఇప్పటికే భారీగా తగ్గించింది ఆర్​బీఐ. ఈ వారం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలు వెలువడనున్నాయి. ఇందులో రెపో రేటుపై తీసుకునే నిర్ణయాలు మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వడ్డీ రేట్లపై ఎంపీసీ నిర్ణయాలు ఆగస్టు 6న వెలువడనున్నాయి.

ఆర్థిక గణాంకాలు..

ఈ వారమే జులై నెలకు సంబంధించి పలు స్థూల ఆర్థిక గణాంకాలు విడుదల చేయనుంది కేంద్రం. ముఖ్యంగా తయారీ, సేవా రంగాల పీఎంఐ లెక్కలు విడుదల కానున్నాయి. ఈ లెక్కలూ మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

త్రైమాసిక ఫలితాలు..

ఈ వారంలో ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించే కంపెనీల జాబితాలో భారతీ ఎయిర్​టెల్, టాటా స్టీల్, లుపిన్, టైటాన్, కెనరా బ్యాంక్, ఎం&ఎం ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు పలు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలపై మదుపరులు దృష్టి సారించొచ్చని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.

జులైకు సంబంధించి వాహన విక్రయాల గణాంకాలను.. ఈ వారం నుంచే విడుదల చేయనున్నాయి ఆటో మొబైల్ సంస్థలు. జూన్​తో పోలిస్తే.. జులైలో విక్రయాలు కాస్త మెరుగైనట్లు వాహన తయారీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నిజమైతే వాహన రంగ షేర్లు సానుకూలంగా స్పందించొచ్చని తెలుస్తోంది.

ఇటు దేశీయంగా, అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, వ్యాక్సిన్​కు సంబంధించిన వార్తలు, అమెరికా-చైనా మధ్య నెలకొన్న అనిశ్చితులు కూడా మార్కెట్లకు కీలకమనే విశ్లేషణలు వస్తున్నాయి.

రూపాయి, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణం అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:యాపిల్ ఐ స్టోర్​ నుంచి 29,800 యాప్​లు డిలీట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.