ETV Bharat / business

భాజపా పాలిత రాష్ట్రాల్లో దిగొచ్చిన పెట్రో ధరలు- మరి మిగతా చోట్ల? - ఎక్సైజ్ సుంకం అంటే ఏమిటి?

ఆకాశాన్నంటిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఆందోళన చెందిన సామాన్యులకు దీపావళిని పురస్కరించుకుని కేంద్రం తీపి కబురు తెలిపింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి భారాన్ని కాస్త దింపింది. అంతేగాక రాష్ట్రప్రభుత్వాలు సైతం వ్యాట్​ను తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. దీనితో భాజపా పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.8, డీజిల్ ధర రూ.9 వరకు దిగొచ్చాయి.

petrol
పెట్రోల్‌
author img

By

Published : Nov 5, 2021, 5:50 PM IST

Updated : Nov 5, 2021, 6:15 PM IST

ఇటీవల కేంద్రం తగ్గించిన ఎక్సైజ్​ సుంకంతో పాటు.. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాట్ తగ్గగా ఇంధన ధరలు దిగొచ్చాయి. వీటిలో మహారాష్ట్ర, దిల్లీ, బంగాల్​ వంటి రాష్ట్రాలతో పోల్చితే భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా తగ్గాయి.

కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ ధర కనిష్ఠంగా రూ.5.7, గరిష్ఠంగా రూ.6.35 వరకు దిగొచ్చింది. డీజిల్ ధర కనిష్ఠంగా రూ.11.16, గరిష్ఠంగా రూ.12.88 మేర తగ్గింది. అలాగే పలు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గింపుతో ధరల్లో మార్పులను ఓసారి గమనిస్తే..

  • ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు వరుసగా రూ.6.96, రూ.12.04 మేర తగ్గాయి.
  • లద్దాఖ్​లో లీటరు పెట్రోల్​పై రూ.8.70, డీజిల్​పై రూ.17.5 తగ్గింది.
  • కర్ణాటకలో లీటర్ పెట్రోల్​ ధర రూ.8.62, డీజిల్ ధర రూ.9.40కి తగ్గింది.
  • మధ్యప్రదేశ్​లో లీటర్ ధర పెట్రోల్‌ రూ.6.89, డీజిల్‌ ధర రూ.6.96 క్షీణించింది.
  • దిల్లీలో పెట్రోల్ ధర రూ.6.07, డీజిల్‌ ధర రూ.11.75 తగ్గింది.
  • ఉత్తరాఖండ్​లో లీటరు పెట్రోల్​పై రూ.1.97, డీజిల్​పై రూ.9.52 తగ్గింది.

ఆ రాష్ట్రాల్లో మాత్రం...

భాజపా పాలిత రాష్ట్రాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోలు ధర లీటరుకు రూ.8.7, డీజిల్‌పై రూ.9.52 చొప్పున తగ్గాయి. ఇక ఇప్పటివరకు వ్యాట్ తగ్గించని రాష్ట్రాల జాబితాలో.. రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, తమిళనాడు, దిల్లీ, బంగాల్, కేరళ, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ఉన్నాయి.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్నాయి. జైపుర్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.110.10గా ఉంది. ఆ తర్వాత ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.98 పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.5గా ఉంది. అనేక భాజపా పాలిత రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర 100 రూపాయలకు దిగువకు చేరింది.

ఇక లీటర్‌ డీజిల్‌ ధర సైతం రాజస్థాన్‌లో అత్యధికంగా రూ.95.71 కాగా... ఆంధ్రప్రదేశ్‌లో రూ.95.18గా ఉంది. మిజోరంలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.55 పైసలు మాత్రమే ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 5, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.