ETV Bharat / business

ఓలా ఈ- స్కూటర్లకు భారీ క్రేజ్​.. 24 గంటల్లోనే.. - ఓలా ఈబైక్స్​

ఓలా ఈ-స్కూటర్లకు భారీ స్పందన లభిస్తోంది. 24 గంటల్లోనే లక్ష బుకింగ్​లు రావడంపై ఓలా హర్షం వ్యక్తం చేసింది. వాహన తయారీ రంగంలో కీలక మార్పులు తీసుకురావాలన్న తమ లక్ష్యానికి ముందడుగు పడిందని సంస్థ సీఈఓ భవిష్​ అగర్వాల్​ పేర్కొన్నారు.

ola bike booking response, 1 lakh ola bikes bookings
ఓలా బైక్స్​కు భారీ క్రేజ్
author img

By

Published : Jul 17, 2021, 3:15 PM IST

దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ప్రవేశపెట్టిన ఈ-స్కూటర్లకు భారీ స్పందన లభిస్తోంది. 24 గంటల్లో లక్ష బుకింగ్​లు వచ్చినట్లు ఓలా ఎలక్ట్రిక్​ శనివారం వెల్లడించింది.

గురువారం సాయంత్రం నుంచి ఓలా.. బుకింగ్స్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవహారంపై సంస్థ సీఈఓ హర్షం వ్యక్తం చేశారు.

"దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఆనందంగా ఉంది. ప్రజలు ఎలక్ట్రానిక్​ వెహికిల్స్​వైపు మొగ్గు చూపుతున్నారు అనడానికి ఇది నిదర్శనం. వాహన తయారీ రంగంలో కీలక మార్పులు తీసుకురావాలన్న మా లక్ష్యానికి ముందడుగు పడింది."

-భవిష్​ అగర్వాల్​, ఓలా సీఈఓ.

త్వరలోనే ఓలా ఈ-స్కూటర్​ ఫీచర్స్​, ధర మొదలైన వివరాలను సంస్థ వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్​ను తక్కువ ధరకే విక్రయిస్తామని సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. స్కూటర్​ వేగం, బూట్​స్పేస్​, రేంజ్​ ఉన్నతస్థాయిలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది.

'మేడ్​ ఇన్​ ఇండియా' నుంచి విదేశాలకు ఈ స్కూటర్లు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఓలా. ఇందుకు సంబంధించి ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులో ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి : రిలయన్స్​ చేతికి 'జస్ట్​ డయల్'​.. 41% వాటా సొంతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.