ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి- ఐదో రోజూ నష్టాలే - నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. భారతీ ఎయిర్​టెల్ షేర్లు భారీగా నష్టపోయాయి.

Share Market news
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Sep 23, 2020, 3:48 PM IST

Updated : Sep 23, 2020, 4:18 PM IST

వరుసగా ఐదో సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం సెషన్​లో బీఎస్ఈ-సెన్సెక్స్ 66 పాయింట్లు తగ్గి 37,668 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 11,132 వద్దకు చేరింది.

ఆరంభంలో కాస్త సానుకూలంగా స్పందించిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో మిడ్​ సెషన్​ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిపై వెలువడుతున్న ప్రతికూల అంచనాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు దగ్గర పడుతుండటం కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

stock markets today
నేటి స్టాక్ మార్కెట్ల తీరు

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 38,140 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,313 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,259 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,024 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

యాక్సిస్ బ్యాంక్, హెచ్​యూఎల్​, ఇన్ఫోసిస్, నెస్లే, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.

భారతీ ఎయిర్​టెల్ అత్యధికంగా నష్టాన్ని నమోదు చేసింది. టాటా స్టీల్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, సియోల్, హాంకాంగ్​ సూచీలు బుధవారం స్వల్పంగా లాభపడ్డాయి. టోక్యో సూచీ మాత్రం నష్టాలతో ముగిసింది.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి బుధవారం స్వల్పంగా పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ ఫ్లాట్​గా రూ.73.57 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ స్వల్పంగా 0.19 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 41.64 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:'ఈ ఏడాది భారత వృద్ది రేటు -5.9 శాతం'

Last Updated : Sep 23, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.