ఏప్రిల్ నెలలో జియో సంస్థకు కొత్తగా 47లక్షల మంది వినియోగదారులు పెరిగారని ట్రాయ్(టెలికాం రెగులేటరీ సంస్థ) వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 120.3 కోట్లు దాటినట్లు తెలిపింది.
ట్రాయ్ డేటా ప్రకారం..
- ఏప్రిల్ నెలలో జియో సంస్థకు కొత్తగా 47లక్షల మంది వినియోగదారులు పెరిగారు. దీంతో దేశంలో మొత్తం జియో వినియోగదారుల సంఖ్య 42 కోట్ల76 లక్షలకు చేరింది.
- ఏప్రిల్‌లో వొడాఫోన్ ఐడియా సంస్థ 18లక్షల మంది యూజర్లు కోల్పోయింది. అయితే మార్చి నెలలో మాత్రం 10లక్షల మంది యూజర్లు పెరిగారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 28 కోట్ల19లక్షలకు పడిపోయింది.
- ఎయిర్‌టెల్‌కు ఏప్రిల్‌లో కొత్తగా 5,10,000 వేల మంది యూజర్లు పెరిగారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 35కోట్ల 29లక్షలకు పెరిగింది.
- భారత్‌లో ప్రస్తుతం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 120.3 కోట్లు దాటింది. గతనెలతో పోల్చితే.. 0.19శాతం పెరిగింది.
- దేశంలో మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్ల సంఖ్య.. 78కోట్ల 28లక్షలు.
- మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లలో 98.8 శాతం మంది ఐదు కంపెనీల వినియోగదారులే.
- బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లలో జియో(43కోట్లు)ది తొలి స్థానం కాగా.. ఎయిర్టెల్(19కోట్లు), ఐడియా(12కోట్లు), బీఎస్ఎన్ఎల్(24కోట్లు), అత్రియా కన్వర్జెన్సీ(18లక్షలు) ఆ తర్వాత ఉన్నాయి.
ఇదీ చదవండి: 5జీ టెస్ట్‌లో ఎయిర్టెల్ అదుర్స్- 1జీబీపీఎస్ స్పీడ్!