Vacci Fare Indigo: విమాన ప్రయాణికుల కోసం బడ్జెట్ క్యారియర్ 'ఇండిగో' సరికొత్త ఆఫర్ ప్రకటించింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కొన్ని విమాన టికెట్లపై 10శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 'వాక్సి ఫేర్' ఆఫర్‌ను ఇండిగో ట్విటర్ వేదికగా ప్రకటించింది.
అయితే ఈ ఆఫర్‌పై కొన్ని షరతులు కూడా ఉన్నట్లు ఇండిగో వెల్లడించింది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయానికి భారత్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కేవలం ఇండిగో వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకునేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేగాక, బుక్ చేసుకున్న తేదీ నుంచి 15 రోజుల తర్వాత ప్రయాణాలకు ఈ డిస్కౌంట్ పొందొచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ తీసుకున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్టు చెక్-ఇన్ కౌంటర్‌లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన టీకా ధ్రువీకరణ పత్రం లేదా ఆరోగ్యసేతు యాప్‌లో వ్యాక్సినేషన్ స్టేటస్‌ను చూపించాలని తెలిపింది. లేదంటే డిస్కౌంట్ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడమే గాక, వారిని విమానంలోకి బోర్డింగ్ అనుమతి కూడా ఇవ్వబోమని ఇండిగో స్పష్టం చేసింది.
బుకింగ్ ఇలా..
- ఇండిగో సైట్ తెరిచి బుక్ ఏ ఫ్లైట్ ఆప్షన్‌కు వెళ్లాలి. అక్కడ వాక్సినేటెడ్ అనే బటన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత వ్యాక్సినేషన్ స్టేటస్‌ను ఎంచుకోవాలి.
- తర్వాత టికెట్ బుక్ చేసుకుని.. టీకా రిజిస్ట్రేషన్ నంబరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: Amazon-Future case: ఫ్యూచర్ రిటైల్‌కు ఊరట- మళ్లీ విచారణకు ఆదేశాలు