స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా భారత్‌కు సంబంధించిన స్విస్ బ్యాంకు ఖాతాల(swiss bank account) వివరాలు మూడో విడతగా ఈ నెలలో అందనున్నాయి. ఇందులో తొలిసారిగా స్థిరాస్తులు (రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్) కలిగిన భారతీయుల డేటా కూడా ఉంటుందని అధికారవర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈమేరకు స్విట్టర్లాండ్‌లో ఫ్లాట్లు, అపార్టుమెంట్లు వంటివి ఉన్న భారతీయులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుతుందని తెలిపాయి. ఆయా స్థిరాస్తుల ద్వారా వారు సంపాదిస్తున్న ఆదాయ వివరాలు కూడా ఇందులో పొందుపరుస్తారని పేర్కొన్నాయి.
'ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ)'లో(Automatic Exchange of Information) భాగంగా స్విట్జర్లాండ్ నుంచి 2019 సెప్టెంబరులో తొలి విడత సమాచారం భారత్‌కు అందింది. 2020 సెప్టెంబరులో రెండో సెట్ స్విస్ బ్యాంక్ ఖాతా వివరాలు అందాయి. తాజాగా మూడో విడత వివరాలు అందనున్నాయి.
మరోవైపు.. స్విస్ బ్యాంకు(Swiss bank)లో భారతీయులు, భారతీయ సంస్థలు దాచుకున్న సొమ్ము రూ.20,700 కోట్లకు పెరిగిందని జూన్లో స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు వార్షిక నివేదిక వెల్లడించింది. 13 ఏళ్ల గరిష్ఠానికి భారత్ డిపాజిట్లు చేరినట్లు చెప్పింది. అయితే.. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. భారతీయుల డిపాజిట్లు 2019 నుంచి తగ్గుతున్నాయని వెల్లడించింది. ఈ వార్తలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. డిపాజిట్ల విలువలో మార్పులకు గల కారణాలపై స్విట్జర్లాండ్ అధికారుల నుంచి వివరణ కోరినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: విద్యుత్తు వాహన ఛార్జర్లు ఉంటేనే కొత్త ఇంటికి అనుమతి!