ETV Bharat / business

లాకర్‌ను ఉపయోగిస్తున్నారా?.. అయితే ఇవి తెలుసుకోండి!

బంగారం.. విలువైన పత్రాలు.. దాచుకోవడానికి నమ్మకమైన చోటు బ్యాంకు లాకర్‌(bank locker rules) అని చాలామంది విశ్వాసం. ఒకవేళ లాకర్‌లో పెట్టిన వస్తువులు మాయమైతే ఏమిటి పరిస్థితి? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? లాకర్‌ను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తెలుసుకుందామా..

Bank locker
బ్యాంకు లాకర్​
author img

By

Published : Oct 22, 2021, 12:30 PM IST

కొంతకాలం క్రితం వరకూ బ్యాంకు లాకర్‌లో(bank locker rules) ఉన్న వస్తువులకు బ్యాంకు బాధ్యత వహించేది కాదు. దొంగలు లాకర్లను కొల్లగొట్టినా.. వినియోగదారులకు ఏ మాత్రం నష్టపరిహారం(bank locker new rules) లభించేది కాదు. అయితే, ఇటీవలే ఆర్‌బీఐ(RBI new bank locker rules) ఈ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఏదైనా దోపిడీ, అగ్నిప్రమాదం, మోసం జరిగి, లాకర్‌లోని వస్తువులు పోతే.. లాకర్‌ అద్దెకు 100 రెట్ల పరిహారం ఇవ్వాలని నిబంధనలు తీసుకొచ్చింది. అయితే, లాకర్‌ వినియోగదారులూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

రాసి పెట్టుకోండి..

మీరు లాకర్‌లో పెట్టిన వస్తువుల జాబితాను మీ దగ్గర ఉందా చూసుకోండి. ఏ వస్తువులు పెట్టారు, పత్రాలు ఏం ఉన్నాయి.. ఆ వివరాల జాబితా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. వస్తువులను తీసినప్పుడు, పెట్టినప్పుడు ఆ వివరాలను నమోదు చేయడం మర్చిపోవద్దు. కొన్నిసార్లు లాకర్‌ను చాలా రోజులపాటు వాడకపోవచ్చు. ఇలాంటప్పుడు అందులో ఏమున్నాయన్నది వెంటనే గుర్తుకు రాదు. ఇలాంటప్పుడు మీ విలువైన వస్తువుల జాడ తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా వస్తువు మీ లాకర్‌ నుంచి పోతే.. దాన్ని గుర్తించేందుకు ఇది అవసరం.

ఏడాదికోసారైనా..

లాకర్‌లో వస్తువులను పెట్టి, మర్చిపోవడం సరికాదు. ఏడాదికోసారైనా లాకర్‌ను తెరిచి చూసుకోవాలి. ఒకవేళ దీర్ఘకాలం పాటు లాకర్‌ను తెరవకపోతే.. బ్యాంకులు దాన్ని పగులగొట్టేందుకు అధికారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు ముందుగా వినియోగదారుడికి నోటీసులు పంపిస్తుంది. అప్పుడు ఇన్ని రోజులపాటు లాకర్‌ను ఉపయోగించకపోవడానికి సరైన కారణాన్ని తెలియజేయాలి. దాన్ని అంగీకరించడమా లేదా అనేది బ్యాంకు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి చిక్కులన్నీ తప్పాలంటే.. ఏడాదికోసారైనా లాకర్‌ తాళం తీయడం మేలు.

రుసుములు చెల్లించండి..

కొత్త నిబంధనల ప్రకారం కొత్త వినియోగదారులు లాకర్‌ను ప్రారంభించేందుకు టర్మ్‌ డిపాజిట్లు చేయాలని బ్యాంకులు కోరవచ్చు. ఈ డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీని లాకర్‌ అద్దెగా వాడుకునే బ్యాంకులు మినహాయించుకోవచ్చు. కనీసం మూడేళ్ల అద్దె, అత్యవసరమైతే లాకర్‌ను పగులగొట్టేందుకు అయ్యే ఖర్చులకు సరిపడా ఈ డిపాజిట్‌ ఉంటుంది. అయితే, బ్యాంకుతో ఉన్న సంబంధాలను బట్టి, ఈ డిపాజిట్‌ చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. బ్యాంకులో నగదు నిల్వ అధికంగా ఉండే ఖాతాదారులను ఈ డిపాజిట్ల గురించి బ్యాంకులు ఒత్తిడి చేయకపోవచ్చు. ఒకవేళ మీరు అద్దెను చెల్లించాల్సి ఉంటే.. సమయానికి ఈ రుసుమును చెల్లించేయండి. మూడేళ్లపాటు వరుసగా అద్దె చెల్లించని లాకర్‌ను బ్యాంకు బలవంతంగా తెరిచే అవకాశం ఉంది.

ఏవి ఎక్కడ..

మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను రెండు రకాలుగా విభజించండి. వేటిని ఇంట్లో భద్రపర్చుకోవచ్చు.. వేటిని లాకర్‌లో పెట్టుకోవాలి అనేది చూసుకోవాలి. బ్యాంకు లాకర్‌ భద్రమే కానీ.. 100 శాతం సురక్షితం అని చెప్పలేం. పైగా విలువైన వస్తువులకు ఏదైనా నష్టం జరిగితే.. 100 శాతం నష్టపరిహారమూ అందదు. లాకర్‌లో పెట్టిన వస్తువులు దాని వార్షిక అద్దెకు 100 రెట్లకు మించి ఉండకుండా చూసుకోవడమే మంచిది. కాబట్టి, వస్తువుల విలువ ఆధారంగా లాకర్‌, ఇంటిలో ఉంచాల్సిన వాటిని వేరు చేయాలి. ఆ తర్వాత మీ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోండి. ఇంట్లోనూ.. మంచి నాణ్యమైన లాకర్‌ను తీసుకొని, కొన్ని వస్తువులను భద్రపర్చుకోవచ్చు. ఈ జాగ్రత్తలతోపాటు.. మీ విలువైన వస్తువులకు బీమా పాలసీ తీసుకునే విషయాన్నీ ఆలోచించాలి. ఇంట్లో ఉండే వస్తువులకు, బ్యాంకు లాకర్‌లోని వస్తువులకూ బీమా చేయించుకోవచ్చు.

రచయిత- అధిల్‌ శెట్టి, బ్యాంక్‌బజార్‌.కామ్‌ సీఈఓ

ఇదీ చూడండి: పండగ సమయంలో కొలువుల జాతర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.