బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి బుధవారం రూ.614 దిగొచ్చి.. రూ.50,750 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి డిమాండ్ తగ్గడం వల్ల.. దేశీయంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కూడా బుధవారం కిలోకు భారీగా రూ.1,898 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.59,720 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,874 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సుకు స్వల్పంగా తగ్గి 23.26 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి:'ఈ ఏడాది భారత వృద్ది రేటు -5.9 శాతం'