తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంగారం ధరలు శనివారం (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.150 మేర తగ్గి.. రూ.49,250కు చేరింది. వెండి ధర రూ.52 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (Silver price today) రూ.66,100గా ఉంది.
- హైదరాబాద్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర (Gold Price in Hyderabad) రూ.49,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,100 వద్ద ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,250గా ఉంది. కిలో వెండి ధర రూ.66,100 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,100 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,783 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 23.93 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇంధన ధరల పెంపు..
చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా దిల్లీలో శుక్రవారం పెట్రోల్, డీజిల్పై లీటర్కు (Petrol price hike) 35 పైసలు చొప్పున పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
- హైదరాబాద్లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.113.32కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్కు రూ.106.56 కి చేరింది.
- గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్కు రూ.115.30కి చేరింది. డీజిల్పై 36 పైసలు పెరిగి లీటర్ రూ.107.92 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.114.03 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.106.69కి చేరింది.
- ఇదీ చూడండి : గూగుల్ పేలో ఎస్బీఐ ఆరోగ్య బీమా పాలసీ!