ETV Bharat / business

Gold sales online: రూ.100కే బంగారం కొనొచ్చు.. ఎక్కడంటే...

పండుగల వేళ బంగారం కొనుగోలు(digital gold) చేస్తే మంచిదని చాలా మంది నమ్ముతారు. అయితే.. వేల రూపాయలు వెచ్చించలేక నిరాశ పడతారు. ఇకపై అలా నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు. కేవలం రూ.100కే బంగారం(digital gold) కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి పలు సంస్థలు(gold business in india). అది ఎలాగో తెలుసుకోండి మరి.

Gold sales online
రూ.100కే బంగారం
author img

By

Published : Oct 3, 2021, 2:50 PM IST

కరోనా మహమ్మారి కారణంగా భారత్​లో బంగారం వ్యాపారంపై(gold business in india) తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో పసిడి విక్రయాల్లో సరికొత్త ఆలోచనలకు పురుడుపోస్తున్నారు ఆభరణాల వ్యాపారులు. ఆన్​లైన్​ ద్వారా(digital gold) కేవలం ఒక డాలర్​కు బంగారాన్ని విక్రయించటం ప్రారంభించారు.

కరోనా సంక్షోభం(Corona crisis) నుంచి తేరుకునేందుకు.. టాటా గ్రూప్​ తనిష్క్(digital gold tanishq )​, కల్యాణ్​ జువెలర్స్​ ఇండియా, పీసీ జువెలర్స్​, సెన్కో గోల్డ్​ అండ్​ డైమండ్స్​.. కేవలం రూ.100కు(1.53 డాలర్లు) చిన్న పరిమాణంలో బంగారాన్ని విక్రయించే ఆఫర్స్​ ప్రకటించాయి. ఆన్​లైన్​ ద్వారా(Gold sales online) లేదా వాటి అధికారిక వెబ్​సైట్ల ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అలాగే.. డిజిటల్​ గోల్డ్​ ప్లాట్​ఫామ్స్​తో భాగస్వామ్యంతోనూ అమ్మకాలు చేపట్టాయి. అయితే.. కనీసం ఒక గ్రాము పసిడికి సరిపడా నగదు జమ అయిన తర్వాతే వినియోగదారులకు డెలివరీ చేస్తారు.

కొత్తేమీ కాదు..!

డిజిటల్​ గోల్డ్​ విక్రయాలు భారత మార్కెట్లో(gold business in india) కొత్తేమీ కాదు. ఆగ్మాంట్​ గోల్డ్​, వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ ఆధారిత సేఫ్​గోల్డ్​.. ఇలాంటివి గతంలో చేపట్టాయి. అయితే.. బంగారం కొనుగోళ్లు వ్యక్తిగతంగా జరుగుతన్న నేపథ్యంలో.. ఆభరణాల వ్యాపారులు ఎక్కువ శాతం ఆన్​లైన్​ విక్రయాలకు(digital gold) దూరంగా ఉన్నారు.

యువతపై ప్రత్యేక దృష్టి..

భారత్​లో ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్​ మొదలు కానుంది. బంగారం డిమాండ్​ పెరగనున్న నేపథ్యంలో కొత్త కొత్త ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యాపారులు. కొద్ది కాలంగా ఆన్​లైన్​ ద్వారా(Gold sales online) బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నందున.. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు దాదాపుగా ఆభరణాల వ్యాపారులు అందరూ ఆన్​లైన్​ బాటలో పయనిస్తున్నారు.

2019లో జరిగిన విక్రయాల్లో ఆన్​లైన్​ గోల్డ్​ కొనుగోళ్లు కేవలం 2 శాతంగానే ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే.. ఈ ట్రాన్సాక్షన్స్​ చేసింది 45 ఏళ్ల లోపు వారే కావటం గమనార్హం. కొద్ది రోజులుగా బంగారం ధరలు పడిపోతున్న నేపథ్యంలో.. డిజిటల్​ సేల్స్​ పెరుగుతున్నట్లు నగల వ్యాపార సంస్థలు తెలిపాయి. ముఖ్యంగా రూ.3 వేల నుంచి రూ. 4వేల వరకు ఉండే నాణాలు, కడ్డీలను ఆన్​లైన్​ ద్వారా కొనుగోలు చేస్తున్నారని.. గత ఏడాదితో పోల్చితే ఈ పండుగల సీజన్​లో 20-30శాతం విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్​ 10 గ్రాముల పసిడి ధర(Gold Price in Hyderabad) రూ.47,899, వెండి ధర రూ.62,059 వద్ద ఉంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర(Gold Price in Vizag) రూ.47,899, వెండి ధర రూ.62,059 వద్ద ఉంది.

విజయవాడలో 10 గ్రాముల బంగార ధర(Gold Price in Vijayawada) రూ.47,899 వద్ద, వెండి ధర రూ.62,059 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్​ గోల్డ్​ ఔన్సు ధర 1760.60 డాలర్లుగా కొనసాగుతోంది.

ఇదీ చూడండి: దసరా వచ్చేస్తోంది.. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.